పల్లెల్లో చెట్లు ఎక్కువగా ఉంటాయి.. దాంతో తరచుగా ఎన్నో రకాల పాములు కనిపిస్తూ ఉంటాయి..అందులో కొన్ని పాములు చాలా విషపూరితమైనవి..కాటు పడితే క్షణాల్లో ప్రాణాలు పోతాయి..మరి కొన్ని పాములు కరిచిన విషం ఎక్కధు..ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పాముల్లో ఎక్కువ పాములు విషపూరితమైనవి కావు. అయితే, పామును చూస్తే చాలు ప్రజలు.. వెంటనే భయంతో పరుగులు తీస్తారు. ప్రస్తుతం పాముకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇది చాలా ఫన్నీగా ఉంది. ఈ వీడియో చూసిన తర్వాత మీకు కూడా నవ్వడం ఖాయం.ఆ వీడియోలో.. ఒక పెద్ద నాగుపాము నోటిలో చెప్పుని పట్టుకుని జరాజరా పాకుతూ వెళ్ళిపోతుంది. మరి పాము ఆ చెప్పుతో ఏం చేస్తుందో ఎవరికీ తెలియదు.. కానీ, ఈ సీన్ ను మాత్రం నెటిజన్లు చాలా ఎంజాయ్ చేస్తున్నారు. వీడియోలో.. ఇటుకల లోపల నుండి ఒక పెద్ద పాము బయటకు వచ్చి .. ఒక ఇంటి వైపుకి వస్తుంది. అలా బయటకు రాగానే ఆ పాముకి ఓ ఇంటి బయట ఒక చెప్పు కనిపించింది.
అంతే వెంటనే పాము ఆ చెప్పుని తన నోటితో పట్టుకుని.. చకచకా పాకుతూ అక్కడ నుంచి పారిపోతుంది. కొంచెం దూరం వెళ్లిన పాము పొదల్లోకి వెళ్లి అక్కడ నుంచి కనిపించకుండా మాయమైపోయింది.ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలియదు కానీ నెట్టింట మాత్రం ఈ వీడియో వైరల్ అవుతుంది.ఈ ఘటన బీహార్ లేదా తూర్పు ఉత్తర ప్రదేశ్‌లో జరిగి ఉండవచ్చని ఊహిస్తున్నారు. ఈ ఫన్నీ వీడియోను ఐఎఫ్‌ఎస్ అధికారి పర్వీన్ కస్వాన్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విట్టర్‌లో షేర్ చేశారు.దీనికి రకరకాల కామెంట్లు వస్తున్నాయి..బహుశా గర్ల్ ఫ్రెండ్ కు గిఫ్ట్ గా ఇస్తుందేమోనని అంటున్నారు..మొత్తానికి ఈ వీడియో తెగ వైరల్ అవుతుందని తెలుస్తుంది..
I wonder what this snake will do with that chappal. He got no legs. Unknown location. pic.twitter.com/9oMzgzvUZd
— Parveen Kaswan, IFS (@ParveenKaswan) November 24, 2022