నీట్ హాల్​టికెట్లు వచ్చేశాయి.. ఇలా డౌన్​లోడ్ చేసుకోండి

-

దేశవ్యాప్తంగా వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్‌ యూజీ  పరీక్ష హాల్‌ టికెట్లు వచ్చేశాయి.  మే 7న (ఆదివారం) జరిగే ఈ పరీక్షకు అడ్మిట్‌ కార్డులను  జాతీయ పరీక్షల సంస్థ ఇవాళ విడుదల చేసింది. పెన్ను, పేపర్‌ విధానంలో దేశవ్యాప్తంగా 499 నగరాలు/పట్టణాల్లో జరిగే ఈ పరీక్షకు ఎన్‌టీఏ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఇటీవల సిటీ ఇంటిమేషన్‌ స్లిప్‌లను విడుదల చేసిన ఎన్‌టీ.. తాజాగా హాల్‌ టికెట్లను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది.

నీట్ హాల్‌టికెట్ల కోసం క్లిక్‌ చేయండి

పరీక్ష రాసే విద్యార్థులు పైన ఉన్న లింక్‌లో తమ అప్లికేషన్‌ నంబర్‌, పుట్టిన తేదీ వివరాలతో పాటు అక్కడ పేర్కొన్న సెక్యూరిటీ పిన్‌ ఎంటర్‌ చేయడం ద్వారా హాల్‌టికెట్లు పొందొచ్చు. తెలుగుతో పాటు 13 భాషల్లో జరిగే ఈ పరీక్షను గతేడాది 17.64లక్షల మంది విద్యార్థులు రాయగా.. ఈ ఏడాది దాదాపు 20లక్షల మంది రాసే అవకాశం ఉందని అంచనా. అడ్మిట్‌ కార్డును ప్రింట్‌ తీసుకొని దాంతో పాటు  ఎన్‌టీఏ అడిగిన డాక్యుమెంట్‌లు, ఫొటోలను తీసుకొని విద్యార్థులు పరీక్ష కేంద్రాల వద్దకు చేరుకోవాల్సి ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news