రాజ్యసభ సభ్యుడిగా ఇళయరాజా పదవీ ప్రమాణం

-

ప్రపంచ ప్రఖ్యాత సంగీతకారుడు, భారతీయ సినీ సంగీత దర్శకుడు మాస్ట్రో ఇళయరాజా ను రాష్ట్రపతి కోటాలో రాజ్యసభ సభ్యుడిగా ఇటీవలే ఎన్నికైన సంగతి తెలిసిందే. కాగా సోమవారం ఆయన రాజ్యసభ సభ్యుడిగా పదవీ ప్రమాణం చేశారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో భాగంగా సోమవారం రాజ్యసభలో డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్ ఆయన చేత రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేయించారు.

ఇళయరాజా తో పాటు తెలుగు సినీ కదా రచయిత విజయేంద్రప్రసాద్, కర్ణాటక కు చెందిన సామాజికవేత్త వీరేంద్ర హోగ్దే, కేరళకు చెందిన పరుగుల రాణి పి.టి.ఉషలను ఇటీవల కేంద్రం రాష్ట్రపతి కోటాలో రాజ్యసభ సభ్యులుగా ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. అయితే వీరిలో ఇప్పటికే పి.టి.ఉష విజయేంద్ర ప్రసాద్ లు ప్రమాణ స్వీకారం చేయగా.. సోమవారం ఇళయరాజా పదవీ ప్రమాణం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news