భారత ఓటర్లు మోదీని మందలించారు: వాషింగ్టన్‌ పోస్ట్‌

-

భారత్‌ సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై విదేశీ నేతలు స్పందించారు. ప్రధాని మోదీకి శుభాకాంక్షలు తెలిపారు. వారితో పాటు ఈ ఎన్నికలపై ప్రపంచంలోని ప్రముఖ పత్రికలు కూడా స్పందించాయి. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ స్పష్టమైన ఆధిక్యం సాధించనప్పటికీ.. ప్రధాని మోదీ మూడోసారి అధికారాన్ని కొనసాగించేందుకు సిద్ధంగా ఉన్నారంటూ అమెరికా మీడియా సంస్థ ‘ది వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌’ కథనం ప్రచురించింది. భారత ఓటర్లు మోదీని మందలించారని వాషింగ్టన్‌ పోస్టు పేర్కొంది. హిందుత్వ వాదులకు ఎదురుదెబ్బ తగిలిందని తెలిపింది.

మరోవైపు మోదీ మెజార్టీ కోల్పోయారని బ్రిటన్‌ మీడియా సంస్థ ‘ది గార్డియన్‌’ అభిప్రాయపడింది. అధికారాన్ని నిలబెట్టుకోవాలంటే భాగస్వామ్య పక్షాల మద్దతు అవసరం అని తెలిపింది. మోదీ ప్రభంజనానికి బ్రేకులు పడ్డాయని ‘న్యూయార్క్‌ టైమ్స్‌’ పేర్కొంది. ఎన్నికల ఫలితాలు మోదీని, ఆయన పార్టీని దిగ్భ్రమకు గురిచేశాయంటూ.. ఈ ఎన్నికల్లో తిరుగులేని మెజార్టీని సాధించలేకపోయారని సీఎన్‌ఎన్‌  విశ్లేషించింది.

Read more RELATED
Recommended to you

Latest news