24 గంటల్లో 96,424 క‌రోనా కేసులు..

భారత్‌లో కేవలం 24 గంటల్లో 96,424 కోవిడ్ -19 కేసులు న‌మోదు అయ్యాయి. దీంతో భార‌త్ 5.2 మిలియన్ల మార్కును అధిగమించింది. ఒక్క‌రోజులో క‌రోనాతో 1,140మంది మృతి చెంద‌గా.. మొత్తం మ‌ర‌ణాల సంఖ్య 84,404 కు చేరుకుంది. ఇక్క‌డ మ‌రొక ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమిటంటే.. గత ఏడు రోజుల్లోనే భారతదేశంలో 652,355 కరోనావైరస్ కేసులు నమోదయ్యాయి. ఇక అత్య‌ధికంగా మహారాష్ట్ర (1,145,840), ఆంధ్రప్రదేశ్ (600,000), తమిళనాడు (525,000), కర్ణాటక (494,356), ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌ (336,000) కేసులు న‌మోదు అయ్యాయి.

ఢిల్లీలో మొత్ం కేసుల సంఖ్య 234,000కు చేరుకుంది. వచ్చే 10-15 రోజుల్లో దేశ రాజధానిలో కోవిడ్ కేసులు పెరుగుతాయని ఢిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేందర్ జైన్ చెప్ప‌డం గ‌మ‌నార్హం. ఇక ప్ర‌పంచ వ్యాప్తంగా కరోనావైరస్ కేసుల సంఖ్య 30,333,687కు చేరుకుంది. ఇప్ప‌టివ‌ర‌కు 22,019,308 మంది కోలుకోగా, 950,132 మంది మరణించారు. అత్యధికంగా అమెరికాలో 6,874,006 కేసులు ఉన్నాయి. ఆ త‌ర్వాత భార‌త్‌లో (5,214,677), బ్రెజిల్ (4,457,443), రష్యా (1,085,281) కేసులు ఉన్నాయి.