దావూద్‌ను ఇండియాకు అప్పగిస్తారా.. పాక్ ఎఫ్‌ఐఏ డైరెక్టర్‌ రియాక్షన్ ఏంటంటే..?

-

పాక్‌లో దాక్కున్న అండర్‌ వరల్డ్‌ డాన్‌ దావూద్‌ ఇబ్రహీం, ముంబయి పేలుళ్ల సూత్రధారి హఫీజ్‌ సయీద్‌ గురించి పాకిస్థాన్ ఎఫ్ఐఏ డైరెక్టర్ జనరల్ మోసిన్ బట్ ను ఇండియన్ మీడియా ప్రశ్నించింది. దానికి ఆయన సమాధానం చెప్పేందుకు నిరాకరించారు. ఇలాంటి ప్రశ్నలు అడగొద్దంటూ చేతితో సైగలు చేశారు. ఈ సంఘటనకు దిల్లీలో జరుగుతున్న ఇంటర్‌పోల్‌ 90వ వార్షిక సమావేశాలు వేదికయ్యాయి.

ఈ సమావేశాలకు ఇస్లామాబాద్‌ నుంచి ఫెడరల్ ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీ డైరెక్టర్‌ జనరల్‌ మోసిన్ బట్‌తో పాటు మరో అధికారి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఓ జర్నలిస్టు మోసిన్‌ బట్‌తో మాట్లాడారు. ‘‘దావూద్‌ ఇబ్రహీం, హఫీజ్‌ సయీద్‌ ఎక్కడున్నారు? వారిని భారత్‌కు అప్పగించే అవకాశాలున్నాయా?’’ అని ఆ జర్నలిస్టు ప్రశ్నించారు. అయితే దీనికి సమాధానం చెప్పకుండా ఆయన మౌనంగా ఉన్నారు. ఇలాంటి ప్రశ్నలు అడగొద్దంటూ చేతితో సైగ చేశారు.

ఇంటర్‌పోల్‌ కార్యకలాపాలకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకునేందుకు ఈ సంస్థ పాలకమండలి ఏడాదికోసారి సమావేశాలు నిర్వహిస్తుంది. ఈ ఏడాది దిల్లీలో జరుగుతున్న ఈ సమావేశాలను భారత ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించారు.

Read more RELATED
Recommended to you

Latest news