జమ్మూకాశ్మీర్, అండమాన్ నికోబార్ దీవుల్లో భూకంపాలు

-

ఇండియాలో ఒకే రోజు రెండు చోట్ల భూకంపాలు సంభవించాయి. తక్కువ తీవ్రతతో భూకంపాలు రావడంతో పెద్దగా ఆస్తి, ప్రాణ నష్టాలు సంభవించలేదు. మంగళవారం తెల్లవారుజామున అండమాన్ నికోబార్ దీవుల్లో భూకంపం వచ్చింది. అండమాన్ నికోబార్ దీవులకు ఉత్తరాన 147 కిలోమీటర్ల దూరంలో తెల్లవారుజామున 2.52 గంటల ప్రాంతంలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై 4.4 తీవ్రతో భూకంపం వచ్చింది. ఈ విషయాన్ని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ వెల్లడించింది.

జమ్మూ కాశ్మీర్ లో కూడా ఈరోజు భూకంపం సంభవించింది. అల్చి ( లేహ్) కు ఉత్తరాన 186 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉంది. మంగళవారం ఉదయం 7.29 గంటలకు ఈ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై 4.3 తీవ్రతో భూకంపం వచ్చింది. ఈరెండు కూడా తక్కువ తీవ్రతో రావడం వల్ల పెద్దగా ప్రాణ, ఆస్తి నష్టాలు కలగలేదు. భూకంప తీవ్రత వల్ల ఆయా ప్రాంతాల్లోని జనావాసాల్లో ప్రకంపనతో జనాలు ఆందోళన చెందారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news