డిసెంబర్ వ‌ర‌కు లాక్‌డౌన్..? నిపుణులు ఏమంటున్నారంటే..?

-

కోవిడ్ రెండో వేవ్ ప్ర‌భావం ఇప్పుడిప్పుడే త‌గ్గుతోంది. జూన్ చివ‌రి వ‌ర‌కు కోవిడ్ రెండో వేవ్ పూర్తిగా త‌గ్గుతుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. అయితే మూడో వేవ్ వ‌స్తుందేమోన‌ని రాష్ట్రాలు ఇప్ప‌టి నుంచే సిద్ధ‌మ‌వుతున్నాయి. గ‌తంలో క‌న్నా రెట్టింపు స్థాయిలో వైద్య స‌దుపాయాల‌ను క‌ల్పించేందుకు సిద్ధ‌మ‌వుతున్నాయి. అయితే కోవిడ్ రెండో వేవ్‌లో కేసుల సంఖ్య త‌గ్గుతుండ‌డంతో అనేక చోట్ల ఆంక్ష‌ల‌ను స‌డ‌లిస్తున్నారు. కానీ డిసెంబ‌ర్ వ‌ర‌కు లాక్‌డౌన్ త‌ర‌హా ఆంక్ష‌ల‌ను అమ‌లు చేయాల‌ని నిపుణులు సూచిస్తున్నారు.

lock down till december what experts are saying

కోవిడ్ రెండో వేవ్ ప్ర‌భావం త‌గ్గుతోంది. మూడో వేవ్ ఎప్పుడు వ‌స్తుందో తెలియ‌దు. క‌నుక క‌రోనా ప్ర‌భావం అస‌లు లేద‌ని తెలిసే వ‌ర‌కు ప్ర‌జ‌లు జాగ్ర‌త్తగా ఉండాల్సిందే. రాష్ట్రాలు కూడా క‌ఠిన ఆంక్ష‌ల‌ను అమ‌లు చేయాలి. మూడో వేవ్ న‌వంబ‌ర్‌లో మొద‌లు అవుతుంది అనుకుంటే 4 నెల‌ల పాటు అంటే ఫిబ్ర‌వ‌రి 2022 వ‌ర‌కు అది ఉంటుంది. క‌నుక అప్ప‌టి వ‌ర‌కు క‌ఠిన నిబంధ‌న‌ల‌ను అమ‌లు చేయాలి. జూన్ 2022 వ‌ర‌కు కోవిడ్ ప్ర‌భావం ఉండే అవ‌కాశం ఉంది. క‌నుక అప్ప‌టి వ‌ర‌కు ముప్పు త‌ప్పింద‌ని అస్స‌లు అనుకోకూడ‌దు.. అని నిపుణులు సూచిస్తున్నారు.

అయితే కోవిడ్ రెండో వేవ్ ప్ర‌భావం త‌గ్గుతున్నందున ప్ర‌స్తుతానికి అనేక చోట్ల ఆంక్ష‌ల‌ను స‌డ‌లిస్తున్నారు. కానీ మూడో వేవ్ వ‌స్తే మ‌ళ్లీ లాక్‌డౌన్ దిశ‌గా అడుగులు వేయ‌క త‌ప్ప‌దు. మ‌రి అప్ప‌టి వ‌ర‌కు రాష్ట్రాలు నిబంధ‌న‌ల‌ను కొన‌సాగిస్తాయా ? లేక అప్ప‌టిక‌ప్పుడు లాక్ డౌన్ దిశ‌గా నిర్ణ‌యాలు తీసుకుంటాయా ? అన్న‌ది వేచి చూస్తే తెలుస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news