లౌడ్ స్పీకర్ వివాదం: మహారాష్ట్ర వ్యాప్తంగా భద్రత కట్టుదిట్టం, రాజ్ ఠాక్రే నివాసం ముందు పోలీస్ పహారా

-

మహారాష్ట్రలో హై అలెర్ట్ నెలకొంది. ప్రస్తుతం మహా రాజకీయం అంతా లౌడ్ స్పీకర్ల చుట్టూ తిరుగుతోంది. మసీదుల్లో లౌడ స్పీకర్లు తొలగించాలని మే 3 వరకు డెడ్ లైన్ విధించారు ఎంఎన్ఎస్ చీఫ్ రాజ్ ఠాక్రే. సర్కార్ ఈ పనిని చేయకపోతే… హనుమాన్ చాలీసా వినిపిస్తామని హెచ్చరించారు. అందుకు తగ్గట్లుగానే ఈ రోజు ముంబైలోని చార్కోప్ ఏరియాలో ఈ రోజు( బుధవారం)  ఆజాన్ సమయంలో హనుమాన్ చాలీసా వినిపించారు. 

ఇదిలా ఉంటే రాజ్ ఠాక్రే ఇంటి ముందు భారీగా పోలీసులు మోహరించారు. శాంతి భద్రతల విషయంలో ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా రాజ్ ఠాక్రే నివాసాన్ని పోలీసులు చుట్టుముట్టారు. దీని కన్నా ముందు జౌరంగాబాద్ లో చేసిన మెగా ర్యాలీలో రాజ్ ఠాక్రే చేసిన స్పీచ్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. లౌడ్ స్పీకర్లపై చేసిన వ్యాఖ్యలు విద్వేషానికి దారి తీసేలా ఉన్నాయని పోలీసులు కేసు నమోదు చేశారు. మరోవైపు 2008లో కేసులో సాంగ్లీ జిల్లా కోర్ట్ రాజ్ ఠాక్రేపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news