బంగారు ఆభరణాలపై తక్కువ వడ్డీరేటుకే రుణాలు.. ఈ బ్యాంకుల్లో

-

అత్యవసర పరిస్థితుల్లో ఏదైనా కొనాలనుకునే వారికి గోల్డ్ లోన్ బాగా ఉపయోగపడుతుంది. చాలా మంది బంగారు ఆభరణాలను తాకట్టు పెట్టి ఏదైనా ప్రాపర్టీ లేదా వస్తువులు కొని తర్వాత వాటిని విడిపించుకోవడాన్ని మనం చూడొచ్చు. తక్కువ వడ్డీ రేట్లకే బ్యాంకులు గోల్డ్ లోన్స్ ఇస్తుండటం ఇందుకు కారణం కావచ్చు. దానికి తోడు పర్సనల్ లోన్ కంటే కూడా చాలా వేగంగా తక్కువ వడ్డీ రేట్లతో గోల్డ్ ఆర్నమెంట్స్‌పై లోన్ వస్తుంది. ఈ క్రమంలోనే బంగారు ఆభరణాలను తాకట్టు పెట్టాల్సి ఉంటుంది. ఇక బ్యాంకు మేనేజర్‌కు గోల్డ్ లోన్ విషయమై దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అయితే, క్రెడిట్ స్కోరు చాలా తక్కువగా ఉన్న వారి దరఖాస్తులను బ్యాంకులు రిజెక్ట్ చేస్తాయి.

బంగారు ఆభరణాలు డబ్బులు రిటర్న్ చెల్లిస్తేనే మళ్లీ వెనక్కు వచ్చేస్తాయి. అయితే, బ్యాంకులు గోల్డ్‌ మొత్తానికి లోన్ ఇవ్వరు. ఆ గోల్డ్‌కు మార్కెట్ వాల్యూలో 75 పర్సెంట్ వరకు మాత్రమే రుణం మంజూరు చేస్తారు. ఒకవేళ మీ వద్ద ఉన్న గోల్డ్ వాల్యూ లక్ రూపాయలు అయితే, రూ.75 వేల కంటే ఎక్కువ డబ్బు మీరు రుణంగా పొందలేరు. లోన్ తీసుకునే క్రమంలో బ్యాంకుల వడ్డీ రేట్లు, ప్రాసెసింగ్ ఫీజు, ప్రీపేమెంట్ ఛార్జీలతో పాటు త్వరగా రుణం అందుతుందో లేదో అప్లికెంట్స్ పరిశీలించుకోవాలి. రీపేమెంట్‌లు ఆలస్యమైతే ఫైన్ కట్టాల్సి ఉంటుందన్న విషయాన్ని గమనించి ఈఎంఐలను నిక్కచ్చిగా తెలుసుకున్న తర్వాతే లోన్ తీసుకోవాలి. రెండేళ్లకుగాను ఒక లక్ష రూపాయలకు వడ్డీ రేట్లు, ఈఎంఐలు ఈ బ్యాంకుల్లో ఇలా ఉన్నాయి.

కెనరా బ్యాంక్ వారి వడ్డీ రేటు 7.35 శాతం, ఈఎంఐ రూ.4,493గా ఉంది. పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ వారీ వడ్డీ రేటు 7.00 శాతం కాగా, ఈఎంఐ రూ.4,477. ఇక యూనియన్ బ్యాంక్ వడ్డీ రేటు 8.20 శాతం కాగా, ఈఎంఐ రూ.4,532గా ఉంది. బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి వడ్డీ రేటు 8.45 శాతం కాగా, ఈఎంఐ రూ.4,543గా ఉంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీ రేటు 7.50 శాతం కాగా, ఈఎంఐ రూ.4,500గా ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news