సామాన్యులకు షాక్ ఇస్తున్న ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ధరలు..!

పెట్రోల్‌-డీజిల్‌ నుంచి గ్యాస్‌ సిలిండర్‌ వరకు, ఆహార పదార్థాల నుంచి నిత్యజీవితంలో ఉపయోగించే వస్తువుల వరకు అన్నింటి ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి.గ్యాస్ సిలిండర్ ధరలు రోజు రోజుకు పెరుగుతున్నాయి.. తాజాగా ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ధరలు భారీగా పెరిగాయి. గ్యాస్ సిలిండర్ ధర గత 5 సంవత్సరాలలో రెట్టింపు కంటే ఎక్కువ పెరిగింది. అయితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోలు, డీజిల్‌పై పన్ను తగ్గించడం ద్వారా కొంత ఊరటనిచ్చాయి. కానీ, గృహోపకరణాల గ్యాస్ సిలిండర్ల ధరలు నిరంతరం పెరుగుతూ వస్తోంది. ప్రస్తుతం జూలై 6, 2022న, 14.2 కిలోల డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధర రూ.50 పెరిగింది. ఆ తర్వాత ఢిల్లీలో దాని ధర రూ.1053కి చేరింది.

ఎల్‌పీజీ సిలిండర్ల ధరలు పెరుగుతున్న తీరు సామాన్యుల బడ్జెట్ నిరంతరం పెరిగిపోతోంది. గత 5 సంవత్సరాలలో LPG ధరలు నేరుగా రెండింతలకు పైగా పెరిగాయి. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ వెబ్‌సైట్ నుంచి అందిన సమాచారం ప్రకారం.. ఢిల్లీలో ఆగస్టు 1, 2017న గృహాలలో ఉపయోగించే 14.2 కిలోల ఎల్‌పిజి గ్యాస్ సిలిండర్ ధర రూ.524 ఉండగా, ఒక సంవత్సరం వ్యవధిలో అనేక సార్లు హెచ్చుతగ్గులకు లోనయ్యాయి. ఆగస్టు 1, 2018న దీని ధర రూ. 789.50కి పెరిగింది..ఒక ఏడాది వ్యవధిలోనే గ్యాస్ ధర 265 రూపాయలకు పైగా పెరిగింది..

ఆగస్టు 1, 2019న, దాని ధరలు మునుపటి సంవత్సరంతో పోలిస్తే 574.5 రూపాయలకు తగ్గాయి. ఇక్కడ LPG ధర ఒక సంవత్సరంలో 215 రూపాయలు తగ్గించబడింది. ఆ తర్వాత ఆగస్టు 1, 2020న, 2019తో పోలిస్తే LPG ధర రూ.19.5 పెరిగింది. దీంతో ధర రూ.594కి పెరిగింది. 2020 సంవత్సరం నుండి LPG ధరలలో విపరీతమైన పెరుగుదల ఉంది.ఆగస్ట్ 1, 2020, జూలై 1, 2021 మధ్య చాలా సార్లు పెరిగాయి. జూలై 1, 2021న LPG సిలిండర్ ధర రూ. 834.50కి పెరిగింది. 2020తో పోలిస్తే దీని ధర రూ. 250.50 పెరిగింది. ఇప్పుడు జూలై 6, 2022న రూ. 50 పెరిగిన తర్వాత LPG సిలిండర్ ధర 1053కి చేరింది.ఏడాదికి 219 రూపాయల వరకూ పెరిగింది.ప్రస్తుతం గ్యాస్ సిలిండర్ ధర రూ.1053 కు చేరింది..మరో పది రోజుల్లో ఈ గ్యాస్ ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని సమాచారం..