‘నా భార్యకు దోమలు కుడుతున్నాయి’.. పోలీసులకు యువకుడి ట్వీట్

-

‘దోమలు కుడుతున్నాయి. నా భార్య, కూతురు ఇబ్బంది పడుతున్నారు.. మస్కిటో కిల్లర్​ కావాలి’ అని ఓ యువకుడు పోలీసులకు ట్వీట్ చేశాడు. దానికి పోలీసులు స్పందించి వెంటనే అతడికి.. ఓ మస్కిటో కిల్లర్​ను తెచ్చి ఇచ్చారు. ఎల్లప్పుడు తాము ప్రజల సేవలోనే ఉంటామని నిరూపించారు. ఉత్తర్​ప్రదేశ్​లో ఈ సంఘటన జరిగింది.

యూపీలోని సంభల్ జిల్లాకు చెందిన అసద్​ ఖాన్​ అనే యువకుడి​ భార్యకు ఆదివారం రాత్రి పురిటి నొప్పులు వచ్చాయి. దీంతో ఆమెను చందౌసిలోని ఓ ప్రైవేట్ నర్సింగ్ హోమ్​లో చేర్పించాడు. అదే రాత్రి ఆమె ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. కానీ ఆసుపత్రిలో విపరీతంగా దోమలు ఉన్నాయి. అవి అసద్​ ఖాన్​ భార్యను.. కూతురిని తీవ్రంగా కుడుతున్నాయి. దీంతో చిన్నారి ఏడవడం ప్రారంభించింది. వారి బాధను చూడలేని అసద్​ ఖాన్​.. మస్కిటో కిల్లర్​​ కోసం బయటకు వెళ్లాడు. అర్ధరాత్రి కావడం వల్ల దుకాణాలన్ని మూసి ఉన్నాయి.

ఇక చేసేది లేక మస్కిటో కిల్లర్​ కావాలని కోరుతూ యూపీ పోలీసులకు ట్వీట్​ చేశాడు. పోలీసులు ఈ ట్వీట్​పై మానవీయ కోణంలో స్పందించారు. వెంటనే అసద్ ఖాన్ ట్వీట్​కు రిప్లై ఇచ్చారు. ఆసుపత్రికి వచ్చి అసద్​ ఖాన్​కు మస్కిటో కిల్లర్​ను అందించారు.

Read more RELATED
Recommended to you

Latest news