జ్ఞానవాపి కాంప్లెక్స్ లో హిందూ దేవతలకు పూజలు ప్రారంభమయ్యాయి. బేస్ మెంట్ లో పూజలు చేసుకునేందుకు కోర్టు అనుమతి ఇవ్వడంతో ఇవాళ తెల్లవారుజాము నుంచే పూజలు మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలో జ్ఞానవాపి దగ్గర ప్రభుత్వం భారీ భద్రత ఏర్పాటు చేసింది. మరోవైపు వారణాసిలో సూచిక బోర్డులపై జ్ఞానవాపి మసీదు అని ఉన్నచోట మందిర్ అనే స్టిక్కర్లను అంటించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
కాగా, జ్ఞాన్వాపి మసీదుకు పూర్వం పెద్ద హిందూ దేవాలయం ఉందని పురావస్తు శాఖ నివేదిక సూచిస్తోందని హిందూ పక్షం న్యాయవాది విష్ణుశంకర్ జైన్ తెలిపిన సంగతి తెలిసిందే.అయితే వారణాసిలోని జ్ఞానవాపి మసీదులో ఏఎస్ఐ జరిపిన తవ్వకాల్లో విష్ణువు, హనుమంతుడి విగ్రహాలు బయటపడినట్లు సమాచారం. జ్ఞానవాపి ఒకప్పుడు హిందూ దేవాలయమన్న వాదనల మేరకు కోర్టు అనుమతితో ఏఎస్ఐ మసీదులో అధ్యయనం చేసిన సంగతి తెలిసిందే. ఈక్రమంలోనే ఈ విగ్రహాలు వెలుగుచూసినట్లు తెలుస్తోంది.