మణిపుర్ అల్లర్లు.. పక్కా ప్లాన్‌ ప్రకారం ఆయుధ లూటీకి యత్నం

-

మణిపుర్ లో అల్లర్లు రోజురోజుకు ఉద్ధృతంగా మారుతున్నాయి. తాజాగా ఆ  రాష్ట్రంలోని ఇండియన్‌ రిజర్వు బెటాలియన్‌ వద్ద ఉన్న ఆయుధాలను లూటీ చేసేందుకు అల్లరి మూకలు ప్రయత్నించాయి. వీటిని భద్రతా దళాలు అడ్డుకొన్నాయి. ఈ ఘర్షణల్లో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. మణిపుర్‌లోని చాలా పోస్టుల వద్ద పరిస్థితి ఉద్రిక్తంగానే ఉంది.  రాష్ట్రవ్యాప్తంగా 118 చెక్‌ పాయింట్లను ఏర్పాటు చేశారు. మొత్తం 326 మందిని అరెస్టు చేశారు.

ఈ ఘటన రాష్ట్రంలోని ధౌబాల్‌ జిల్లాలో చోటు చేసుకొంది. వందల సంఖ్యలో అల్లరి మూకలు ఐఆర్‌బీ బెటాలియన్‌ పోస్టుపై దాడి చేశాయి. ఐఆర్‌బీ దళాలకు మద్దతుగా సైన్యం, ర్యాపిడ్‌ యాక్షన్‌ ఫోర్స్‌, ఇతర దళాలు రాకుండా అల్లరి మూకలు రహదారులను ముందే తవ్వేశాయి. కానీ, అసోం రైఫిల్స్‌, ర్యాపిడ్‌ యాక్షన్‌ ఫోర్స్‌ దళాలు ఘటనా స్థలానికి చేరుకోవడంతో ముప్పు తప్పింది. వీరు అల్లరిమూకలను చెదరగొట్టారు. ఈ ఘటనలో ఓ దుండగుడు ప్రాణాలు కోల్పోయాడు.

Read more RELATED
Recommended to you

Latest news