‘పార్ట్‌ టైం సీఎం’ దిల్లీకి అవసరమా.. కేజ్రీవాల్‌పై కేంద్ర మంత్రి విమర్శలు

-

దిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌పై కేంద్ర మంత్రి మీనాక్షీ లేఖి తీవ్రంగా ఫైర్ అయ్యారు. దిల్లీ సమస్యలు పట్టించుకోకుండా కేజ్రీవాల్ పొలిటికల్ టూర్ లో బిజీగా ఉన్నారని అన్నారు. గుజరాత్‌, హిమాచల్‌ ప్రదేశ్‌ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న కేజ్రీవాల్ ను ఉద్దేశిస్తూ ఇలాంటి పార్ట్ టైం సీఎం దిల్లీకి అవసరం లేదంటూ ధ్వజమెత్తారు.

‘‘కేజ్రీవాల్‌ ఏమీ చేయడంలేదు. ఎన్నికల రాష్ట్రాల్లో ప్రచారం చేస్తూ రాజకీయ పర్యాటకంలో తన సమయాన్ని గడుపుతోన్న ఇలాంటి పార్ట్‌ టైం ముఖ్యమంత్రి దిల్లీకి అవసరం లేదు. కేజ్రీవాల్‌ ప్రభుత్వం నిష్క్రియత్వం, బాధ్యతల నుంచి పారిపోతుండటంతో దిల్లీలో పెద్ద సంఖ్యలో వృద్ధులు, చిన్నారులు వాయు కాలుష్య సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారు’’ అని మీనాక్షీ లేఖి ఆరోపించారు.

పర్యాటక సెస్‌ కింద గత ఏడేళ్లుగా రూ.1286 కోట్లు వసూలు చేసిన కేజ్రీవాల్‌ ప్రభుత్వం కాలుష్య నియంత్రణకు కేవలం రూ.272 కోట్లు మాత్రమే ఖర్చు చేసిందని మీనాక్షి లేఖి అన్నారు. కాలుష్యాన్ని ఎదుర్కోవడానికి మౌలిక సదుపాయాల కల్పనకు గానీ సిబ్బందికి శిక్షణ ఇవ్వడానికి నిధులు ఖర్చు చేయలేదని ఆరోపించారు.

Read more RELATED
Recommended to you

Latest news