మాజీ సీఎం జగన్ ఇంటి వద్ద కట్టడం కూల్చివేతలో భారీ ట్విస్ట్ చోటు చేసుకుంది. కాంగ్రెస్ సీనియర్ నేత, దక్షిణ తెలంగాణకి చెందిన ఒక కీలక మంత్రి జిహెచ్ఎంసి కీలక అధికారికి మౌలిక ఆదేశాలు జారీ చేయడంతో నిన్న కూల్చివేత జరిగినట్లు తెలుస్తోంది.

ఒక మాజీ ముఖ్యమంత్రి ఇంటి ప్రహారి కూల్చివేత సమాచారం సాక్షాత్తు తెలంగాణ రాష్ర్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కానీ పోలీస్ ఉన్నతాధికారులకు లేకపోవడం ట్విస్ట్. ఇప్పుడు ఇదే విషయం హాట్ టాపిక్ గా మారింది. అయితే… కాంగ్రెస్ సీనియర్ నేత, దక్షిణ తెలంగాణకి చెందిన ఒక కీలక మంత్రి ఎవరు అని అందరూ చర్చించుకుంటున్నారు. కాగా శనివారం రోజున లోటస్ పాండ్ లోని ఎపి మాజీ సీఎం జగన్ మెహన్ రెడ్డి నివాసం దగ్గర జీహెచ్ ఎంసీ కూల్చివేతలు చేపట్టిన సంగతి తెలిసిందే.