జవాన్లతో మోదీ దీపావళి వేడుకలు.. పాక్, చైనాకు పరోక్షంగా హెచ్చరికలు..!

-

జవాన్లతో కలిసి ప్రధాని మోదీ దీపా‌వళి పండగను ఘనంగా నిర్వహించుకున్నారు. రాజస్థాన్ లోని జైసల్మెర్ చేరుకుని లోంగేవాలా పోస్టులో జవాన్లకు పండగ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మోదీ ప్రసంగించారు. సరిహద్దుల్లో ఆక్రమణలకు పాల్పడుతున్న పొరుగుదేశాలైన పాకిస్థాన్, చైనాకు మోదీ పరోక్షంగా హెచ్చరికలు జారీచేశారు.

విస్తరణవాద శక్తులతో యావత్ ప్రపంచం సమస్య ఎదుర్కొంటోందని దీన్ని భారత్ తీవ్రంగా వ్యతిరేకిస్తోందని తెలిపారు. విస్తరణవాదాన్ని భారత్ ఎదుర్కోవడంలో స్పష్టంగా ఉందన్నారు. దీనిని పరీక్షిస్తే ధీటైన జవాబు ఇవ్వాల్సి ఉంటుదని పేర్కొన్నారు. దేశ సమగ్రత, ప్రయోజనాలపై భారత్ కట్టుబడి ఉందని ఉద్ఘాటించారు. మీరు ఎక్కడున్నా మిమ్మల్ని కలిస్తేనే నా దీపావళి వేడుక పరిపూర్ణమవుతుంది. మీ ముఖంలో సంతోషాన్ని చూస్తే నా ఆనందం రెట్టింపవుతోంది. భారత సైన్యం ధైర్యం వెలకట్టలేనిదని జవాన్లను కొనియాడారు. ఈ సరిహద్దులను ఏ సైనిక శక్తి అడ్డులేదంటూ చైనా, పాకిస్థాన్ కు హెచ్చరించారు.

130 కోట్ల మంది భారతీయులు.. జవాన్లకు అండగా ఉన్నారని మోదీ ఉద్ఘాటించారు. సైన్యం చేస్తున్న పరాక్రమాలకు ప్రతీ భారతీయుడు గర్వపడుతున్నామన్నారు. జవాన్ల పరాక్రమాలకు లొంగేవాల యుద్ధం నిలువెత్తు నిదర్శనం అని మోదీ గుర్తుచేసుకున్నారు. త్రివిధ దళాలు పరస్పరం సహకరించుకుంటూ శత్రురాజ్యంపై విజయం సాధిస్తున్నారని తెలిపారు. మీతో సమయం గడిపితే నాకు ఆనందంగా ఉంటుందని ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు.

సాయుధ బలగాలకు మోదీ కొన్ని సూచనలు చేశారు. జవాన్లు యోగా చేయాలని సూచించారు. మాతృభాష, ఇంగ్లీష్‌ కాకుండా మరో భాషను కూడా నేర్చుకోవాలన్నారు. ఇవి జవాన్లలో ఉత్సాహాన్ని నింపడమేగాక, కొత్త దృక్పథాలకు తోడ్పడుతాయని మోదీ చెప్పారు. మోదీ ప్రధానిగా భాద్యతలు స్వీకరించినప్పటి నుంచి ప్రతి దీపావళిని ఆయన జవాన్లతో జరుపుకోవటం ఆనవాయితీగా వస్తోంది. జవాన్ల కూడా మోదీరాకతో ఎదురు చూస్తుంటారు.

Read more RELATED
Recommended to you

Latest news