BREAKING : పూణేలో ఎలక్ట్రిక్‌ బస్సులు, ఛార్జింగ్‌ స్టేషన్‌ ప్రారంభించ‌నున్న ప్ర‌ధాని మోదీ

-

మహారాష్ట్ర లోని పూణే రహదారులపై మరో 100 ఓలెక్ట్రా ఎలక్ట్రిక్ బస్సులు తిరగనున్నాయి. ఇందులో భాగంగానే ఇవాళ ఎలక్ట్రిక్ బస్సులు, ఛార్జింగ్ స్టేష‌న్‌ను జెండా ఊపి ప్రారంభించ‌నున్నారు దేశ ప్ర‌ధాని మోదీ. పూణేలో ఇప్ప‌టికే విజయవంతంగా 150 ఒలెక్ట్రా బస్సులు నడుస్తున్నాయి.

ఎలక్ట్రిక్ మొబిలిటీలో దేశంలోనే అగ్రగామిగా కొన‌సాగుతున్న ఒలెక్ట్రా… సూరత్, ముంబై, పూణే, సిల్వాసా, గోవా, నాగ్‌పూర్, హైదరాబాద్‌, డెహ్రాడూన్‌లలోనూ న‌డుస్తున్నాయి. కాలుష్య ర‌హిత, శబ్దం లేని ఏసీ ప్ర‌యాణం, భ‌ద్ర‌త‌కు పెద్ద‌పీట ఒలెక్ట్రా బ‌స్సుల ప్ర‌త్యేక‌త‌ అన్న మాట.

పూణే న‌గ‌రం వార‌స‌త్వ ప‌టంలో ఒలెక్ట్రా బ‌స్సుల‌ది ప్ర‌త్యేక స్థానమని వెల్లడించారు ఒలెక్ట్రా గ్రీన్‌టెక్ ఎండీ కె.వి. ప్ర‌దీవ్‌. పూణేలో ఇప్ప‌టివ‌ర‌కు 2 కోట్ల కిలోమీటర్లకు పైగా మా బస్సులు తిరిగాయని.. లిథియం-అయాన్ (Li-ion) బ్యాటరీ ఒక ఛార్జ్‌తో 200 కిలోమీటర్లు ప్ర‌యాణించ‌వ‌చ్చని స్పష్టం చేశారు. MEIL గ్రూప్‌ కంపెనీలలో ఒలెక్ట్రా గ్రీన్‌టెక్ లిమిటెడ్‌ భాగంగా ఉంది.

 

Read more RELATED
Recommended to you

Latest news