రాజస్థాన్ లోని జలౌర్, భీనా మాల్తో పాటు బాంగ్వాడా ఎన్నికల ర్యాలీలో ఆదివారం ప్రధాని మోడీ మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ గెలిస్తే దేశ ప్రజల సంపదను ముస్లింలకు పంపిణీ చేస్తుందన్న ప్రధాని మోడీ వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఫైరయింది. లోక్ సభ ఎన్నికల సరళిని చూసి అసంతృప్తికి గురైన మోడీ మరిన్ని అబద్ధాలు అల్లి, విద్వేష వ్యాప్తితో ప్రజల దృష్టిని మళ్ళించే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తింది.
ప్రధాని తీరు చూస్తుంటే గోబెల్స్ లాంటి నియంత కుర్చీ కదులుతుందని స్పష్టంగా అర్థమవుతుందని అన్నారు. తొలి విడతలో ఇండియా కూటమి గెలుస్తుందని తెలియడంతో మోడీ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని, దేశ చరిత్రలో ఏ ప్రధాని దేశ ప్రతిష్టను ఇంతలా దిగజార్చలేదని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే మండిపడ్డారు. అధికారం కోసం అబద్దాలు చెప్పడం బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఇచ్చే శిక్షణలో ప్రత్యేకత అని విమర్శించారు. కాగా, దేశ వనరులపై మొదటి హక్కు మైనారిటీలదేనని అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ అన్నారని మోడీ గుర్తు చేశారు.