చెరుకు రైతులకు గుడ్ న్యూస్.. సెప్టెంబర్ 17 వరకు షుగర్ ఫ్యాక్టరీ ఓపెన్

-

చెరుకు రైతులకు గుడ్ న్యూస్ అనే చెప్పాలి.   సెప్టెంబర్ 17 వరకు షుగర్ ఫ్యాక్టరీ ఓపెన్ చేస్తామని నిజామాబాద్ జనజాతర సభలో సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. పసుపు బోర్డు తెస్తానని ధర్మపురి అరవింద్ జీవో తీసుకొచ్చాడు. బుకాయించే జీవో  కానీ అందులో నిజామాబాద్ పేరు లేకపోవడం గమనార్హం. నిజామాబాద్ కవిత చక్కర పరిశ్రమను మూసివేయించడంతో కవితపై రైతులు పోటీ చేసి 100 మీటర్లకు దూరంగా పాతిపెట్టారని తెలిపారు.

పంజాబ్, హర్యానా రైతులతో సమానంగా బతికే రైతులు నిజామాబాద్ జిల్లా రైతులు ఏ ప్రభుత్వాన్ని అయిన మెడలు వంచి సమస్యలు పరిష్కరించుకునే సత్తా వారిలో ఉంది. 5 రోజుల్లో బోర్డు తెస్తానన్న బోడగుండు వాళ్లను ఏం చేస్తారో మీరే చెప్పండి. రైతుల కోసం కొట్లాడదలుచుకుంటున్నా.. పసుపు బోర్డును, చక్కర కర్మాగారాన్ని తెరిపించాలని డిమాండ్ చేశారు. ఇండియా కూటమి అధికారంలోకి వస్తుంది.. ఇండియా కూటమి అధికారంలోకి రాగానే జీవన్ రెడ్డి కేంద్ర మంత్రిగా ప్రమాణం చేస్తారని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news