మంకీపాక్స్ ను ఎదుర్కొనేందుకు సిద్ధం: ఐసీఎంఆర్

మంకీపాక్స్ ను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్చ్(ఐసీఎంఆర్) ప్రకటించింది. ఇతర దేశాల్లో మంకీపాక్స్ తీవ్రను ఎప్పటికప్పుడు మానెటరింగ్ చేస్తున్నామని వెల్లడించింది. ఇప్పటికే ఆయా దేశాల నుంచి వస్తున్న ప్రయాణికులను పరీశీలిస్తున్నామని.. ఎవరైనా అనారోగ్యంతో ఉంటే వారి శాంపిళ్లను పూణేలోని ఇండియన్ ఇస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి పంపించాలని ఆదేశాాలు ఇచ్చామని తెలిపింది. ఇండియాలో మంకీపాక్స్ వ్యాధి లేదని ఐసీఎంఆర్ వెల్లడించింది. 

ప్రపంచంలో ఇప్పటికే 20 దేశాల్లో 200 మందికి పైగా మంకీపాక్స్ సోకింది. బ్రిటన్, యూఎస్ఏ, ఆస్ట్రేలియా, బెల్జియం, ఫ్రాన్స్, నెదర్లాండ్స్,జర్మనీ, ఇటలీ, పోర్చుగల్, స్పెయిన్, స్వీడన్, కెనడా, ఇజ్రాయిల్, స్విట్జర్లాండ్, యూఏఈ దేశాల్లో కేసులు నమోదు అయ్యాయి. ఇదిలా ఉంటే ఆఫ్రికా దేశాలైన కామోరూన్, కాంగో, సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్, నైజీరియా దేశాల్లో ప్రజలే ఈ వ్యాధి నెమ్మదిాగా ప్రపంచానికి విస్తరిస్తోంది. త్వరలోనే ఇండియా కూడా మంకీపాక్స్ ను ఎదుర్కొనేందుకు గైడ్ లైన్స్ ఇచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే కేరళ ఆ రాష్ట్ర ప్రజలకు అవగాహన కల్పించే విధంగా కార్యక్రమాలు చేపడుతోంది.