పెళ్లి సందడి షురూ.. మే, జూన్‌లో ఎక్కువ ముహూర్తాలు

-

హేయ్.. హేయ్.. వచ్చేసింది.. పెళ్లి పండగ వచ్చేసింది.. పెళ్లి బాజాలు మోగే సీజన్ వచ్చేసింది. రెండు జంటలు ఏకమయ్యే ఈ వేడుక.. ఎన్నో కుటుంబాల్లో సంతోషాలను నింపే సంబురం వచ్చేసింది. ఈ వేడుక 20 నుంచి 25 రంగాలకు చెందిన వందలాది మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కల్పిస్తుంది. గత మార్చి 28వ తేదీ నుంచి గురు మూఢమితో ఆగిన పెళ్లి బాజాలు ఈనెల 3వ తేది నుంచి మళ్లీ మోగబోతున్నాయి.

మే, జూన్‌ నెలల్లో ఎక్కువ ముహూర్తాలు ఉన్నాయి. జూన్‌ 14వ తేది తరువాత మళ్లీ ఆగస్టు 18వ తేది వరకు శుక్ర మూఢమి కారణంగా పెళ్లిళ్లకు శుభ ముహుర్తాలు లేవు. దీంతో వేసవిలోనే పెళ్లి తంతు పూర్తి చేయాలని వధూవరుల కుటుంబాలు ఇప్పటికే ముహుర్తాలు ఖరారు చేసుకుంటున్నాయి. మే నెలలో 3, 4, 5, 6, 7, 10, 11, 12, 13, 14, 20, 21, 26, 27, 31 తేదిల్లో, జూన్‌లో 1, 3, 5, 7, 8, 9, 10, 11, 14 తేదిల్లో వివాహ ముహూర్తాలు ఉన్నట్లు ప్రముఖ పురోహితుడు చెప్పారు.

ఈ ఏడాదిలో ఉమ్మడి గుంటూరు జిల్లాలో మే నెల 10, 11, 12, 13 తేదిల్లో వేల సంఖ్యలో వివాహాలు నిశ్చయమైనట్లు సమాచారం. ఎక్కువ మందికి సరిపోయే నక్షత్రాలు జూన్‌ 7, 8, 9 తేదిల్లో ఉండటంతో ఆ రోజుల్లోనూ పెళ్లిళ్లు ఎక్కువ జరగబోతున్నాయట.

Read more RELATED
Recommended to you

Latest news