వార్నింగ్ : నిన్న సీఎంకి.. నేడు హోం మంత్రి, ఆ అధినేతకి..!

-

బెదిరింపు ఫోన్ కాల్స్.. ప్రస్తుతం మహారాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయంగా మారిన అంశం.. అలాగే ఆ రాష్ట్ర నాయకులకు నిద్రలేకుండా చేస్తున్న అంశం. ఇటీవలే మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరేకు బెదిరింపు ఫోన్ కాల్స్ వచ్చిన సంగతి అందరికి తెలిసిందే. దుబాయ్ నుంచి ఫోన్ చేస్తున్నాన‌‌ని, మాఫియా డాన్ దావూద్ ఇబ్ర‌హీం త‌ర‌పున కాల్ చేస్తున్నాన‌ని ఆ గుర్తు తెలియని దుండగుడు బెదిరించాడు. రాత్రి 10.30 నిమిషాల‌కు ఆ బెదిరింపు కాల్స్ వ‌చ్చాయి. ఈ ఫోన్ కాల్స్ మహారాష్ట్ర రాజకీయాల్లో ఒక్కసారిగా కలకలం రేపాయి.

అయితే ఈ వ్యవహారం ఇంకా మర్చిపోకముందే.. తాజాగా అలాంటి సంఘటనే ఒకటి మహారాష్ట్ర రాజకీయాల్లో చోటుచేసుకుంది. ఎన్సీపీ అధినేత శరద్ పవార్, మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్ ముఖ్ లకు కూడా ఇలాంటి బెదిరింపు కాల్స్ వచ్చాయి. ఇద్దరు నేతల నివాసానికి బెదిరింపు కాల్స్‌ వచ్చాయని, విదేశాల నుంచి ఈ కాల్స్‌ వచ్చాయని అధికారులు పేర్కొన్నారు. దీనిపై దర్యాప్తునకు ఆదేశించినట్టు వెల్లడించారు. అయితే జరుగుతున్న ఈ పరిణామాలతో మహారాష్ట్ర రాజకీయాల్లో అలజడి మొదలైంది.

Read more RELATED
Recommended to you

Latest news