టోక్యో ఒలింపిక్స్ 2020: స్వర్ణంతో తన సత్తా చాటుకున్న నీరజ్ చోప్రా..!

-

టోక్యో ఒలింపిక్స్ 2020 లో నీరజ్ చోప్రా ( Neeraj Chopra ) వండర్ క్రియేట్ చేశాడు. 2017 జూలైలో ఒడిస్సా లో జరిగిన ఆసియన్ అథ్లెటిక్ ఛాంపియన్ షిప్ లో స్వర్ణ పతకం పొందాడు. 2018 ఏప్రిల్ లో జరిగిన కామన్వెల్త్ క్రీడల్లో స్వర్ణ పతకాన్ని పొందాడు నీరజ్ చోప్రా.

Neeraj-Chopra-with-flag

2018 దోహా డైమండ్ పోటీల్లో 7.3 మీటర్ల దూరం జావలిన్ విసిరి జాతీయ రికార్డును బద్దలు కొట్టాడు నీరజ్ చోప్రా. అంతే కాదు 2018 లో ఇండోనేషియాలో జరిగిన ఆసియా గేమ్స్ లో 8.06 మీటర్ల దూరం విసిరి స్వర్ణం గెలుచుకున్నాడు.

2018 లో కేంద్ర ప్రభుత్వం అర్జున అవార్డు ఇచ్చి ఘనంగా సత్కరించడం కూడా జరిగింది. ఆ తర్వాత టోక్యో ఒలింపిక్స్ లో కూడా అర్హత సాధించుకున్నాడు. చాలా మంది దిగ్గజ ఆటగాళ్ళ మీద ఆశలు పెట్టుకున్నా కాస్త నిరాశ పరిచారు కానీ నీరజ్ చోప్రా మాత్రం అదరగొట్టాడు. తొలిసారి ఒలింపిక్స్ లో ఈ 23 ఏళ్ల నీరజ్ చోప్రా తన సత్తా చాటుకున్నాడు. నిజంగా తన కష్టానికి చేసిన ప్రయత్నానికి మెచ్చుకొని తీరాలి.

మొదటి ప్రయత్నంలోనే 87.03 మీటర్లు జావెలిన్‌ని విసిరాడు. ఆ తర్వాత సెకండ్ టైం 87.58మీ, అలానే మూడవసారి 76.93మీ విసిరాడు. నెక్స్ట్ నాల్గవ సారి 80మీ దగ్గరగా విసిరాడు. కానీ అది ఫౌల్ అయ్యింది. ఆ తర్వాత ఐదో ప్రయత్నంలో కూడా అదే విధంగా జరిగింది. ఫైనల్ గా మాత్రం 84.24 మీటర్లు విసిరాడు. ఆఖరి ప్రయత్నానికి స్వర్ణం దక్కింది.

Read more RELATED
Recommended to you

Latest news