రిహానా.. ఏమిటీ ప‌ని.. భ‌గ్గు‌మంటున్న నెటిజ‌న్లు..!

Join Our Community
follow manalokam on social media

అంత‌ర్జాతీయ పాప్ స్టార్ రిహానా రైతుల ఆందోళ‌న‌ల‌పై ట్వీట్ చేసి వివాదంలో ఇరుక్కున్న సంగ‌తి తెలిసిందే. దీనిపై స‌చిన్ స‌హా ప‌లువురు మాజీలు, బాలీవుడ్ ప్ర‌ముఖులు, ఆఖ‌రికి కేంద్రం కూడా స్పందించింది. రైతుల ఆందోళ‌న‌లు అనేవి మా అంత‌ర్గ‌త విష‌యం. ఇత‌ర దేశాల వారికి వాటితో ప‌నిలేదు, అని కేంద్రం హిత‌వు ప‌లికింది. అయితే తాజా రిహానా చేసిన ప‌ని మ‌రింత దుమారం రేపుతోంది.

netizens angry over rihanna over her latest image

పాప్ స్టార్ రిహానా మెడ‌లో వినాయ‌కుడి లాకెట్‌తో ఉన్న ఓ హారం వేసుకుని టాప్‌లెస్‌గా ఫొటోల‌కు పోజులిచ్చింది. వాటిల్లో ఒక ఫొటోను త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో షేర్ చేసింది. అయితే టాప్‌లెస్ పోజుల‌కు కాదు.. మెడ‌లో వినాయ‌కుడి బొమ్మ‌ను అలా వేసుకుని న‌గ్నంగా పోజులిచ్చినందుకు నెటిజ‌న్లు ఆమెపై భ‌గ్గుమంటున్నారు. దీంతో ఆమె మ‌ళ్లీ వివాదాల్లో చిక్కుకుంది. ఈ విష‌యం చ‌ర్చ‌నీయాంశంగా కూడా మారింది.

రిహానా ట్విట్ట‌ర్‌లో చేసిన పోస్ట్‌కు అనేక మంది భార‌తీయులు మండి పడుతున్నారు. ఆమె ఇలా చేయ‌డం త‌మ భావాల‌ను కించ‌ప‌రిచింద‌ని కామెంట్లు చేస్తున్నారు. దీంతో రిహానా మ‌ళ్లీ చిక్కుల్లో ప‌డింది. అయితే దీనిపై ఇంకా ఏం జ‌రుగుతుందో చూడాలి.

TOP STORIES

ఈ నీలి రంగు గెలాక్సీ ఎంత అందంగా ఉంది : నాసా

గెలాక్సీలో ఎంతో వింతలు చోటు చేసుకుంటాయి. వాటిని చూడాలని అందరూ ఎంతో ఆతురతగా ఎదురు చూస్తుంటారు. ఇటీవల అంగారక గ్రహంపై అడుగు పెట్టిన నాసా.. ల్యాండింగ్...