ఆ నాలుగు రాష్ట్రాల్లో ఎన్ఐఏ సోదాలు

-

దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో జాతీయ దర్యాప్తు సంస్థ సోదాలు చేస్తోంది. భారత్​తో పాటు విదేశాల్లో ఉన్న ఉగ్రవాదులు, గ్యాంగ్‌స్టర్లు, డ్రగ్స్ స్మగ్లర్లు, ట్రాఫికర్ల సంబంధాలను విచ్ఛిన్నం చేయడంలో భాగంగా ఎన్ఐఏ అధికారులు ఇవాళ.. పంజాబ్, హరియాణా, రాజస్థాన్, దిల్లీ-ఎన్​సీఆర్​లోని పలు ప్రదేశాల్లో సోదాలు చేశారు. కానీ ఇప్పటివరకు ఈ కేసులో ఎవరినీ అదుపులోకి తీసుకోలేదని ఎన్​ఐఏ అధికారులు వెల్లడించారు.

ఇటీవలే ఓ డ్రోన్​ డెలివరీ కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ ఇటీవల అక్టోబర్​ 14న జమ్ము కశ్మీర్​లోని పూంచ్​ జిల్లాతో పాటు పలు ప్రాంతాల్లో తనిఖీలు చేసింది. గత తొమ్మిది నెలల్లో పాకిస్థాన్​కు సంబంధించిన 191 డ్రోన్లు భారత్​లోకి అక్రమంగా ప్రవేశించాయి. ఈ పరిణామాలు దేశంలో అంతర్గత భద్రతకు సవాళ్లుగా నిలుస్తున్నాయని అధికారులు చెబుతున్నారు. భారత్​లోకి డ్రోన్ చొరబడిన ఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది. అంతర్జాతీయ సరిహద్దు ద్వారా పంజాబ్​ అమృత్​సర్​లోకి ప్రవేశించిన ఓ డ్రోన్​ను బార్డర్​లోని సైనికులు మట్టి కరిపించారు.

Read more RELATED
Recommended to you

Latest news