ముంబయి కెప్టెన్ గా రోహిత్ ఉండాల్సింది : అంబటి రాయుడు

-

ఐపీఎల్ లో అత్యంత విజయవంతమైన కెప్టెన్ రోహిత్ శర్మ నాయకత్వానికి ముంబై ఫ్రాంచైజీ తెరదించింది. కెప్టెన్సీ నుంచి రోహిత్ ను తప్పించడానికి  కారణం ఏంటో ఇటీవలే గవాస్కర్ బయటపెట్టారు. ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ అంటే రోహిత్ శర్మ.. రోహిత్ శర్మ అంటే ముంబై ఇండియన్స్ అనుకొనే రోజులు పోయాయి. ముంబై కెప్టెన్ గా 10 సీజన్లలో 5 టైటిల్స్ అందించిన రోహిత్ శర్మ నాయకత్వానికి ఫ్రాంచైజీ యాజమాన్యం తెరదించింది. రోహిత్ నాయకత్వానికి వీడ్కోలు పలుకుతూ నయా కెప్టెన్ గా హార్థిక్ పాండ్యాకు స్వాగతం పలికింది.

ఈ నేపథ్యంలో తాజాగా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు స్పందించారు. ముంబై ఇండియన్స్ కెప్టెన్ గా రోహిత్ శర్మను ఇంకో ఏడాది పాటు కొనసాగిస్తే బాగుండేదని తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. హార్దిక్ పాండ్య ఇప్పుడే గుజరాత్ టీమ్ నుంచి వచ్చాడు కాబట్టి.. ఈ సీజన్ లో ప్లేయర్ గా ఆడితే బాగుండేది. రోహిత్ శర్మ భారత జట్టు కెప్టెన్ కాబట్టి ఈ ఏడాదీ టీ 20 వరల్డ్ కప్ కూడా ఉంది. కావును రోహిత్ శర్మను ముంబయి ఇండియన్స్ కెప్టెన్ గా చేయాల్సింది అన్నారు. ప్రస్తుతం ముంబయి ఇండియన్స్ కెప్టెన్ గా రోహిత్ శర్మను తొలగించడం ఇప్పటికీ హాట్ టాపిక్ గా నిలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news