పార్లమెంట్ ఎన్నికల సెకండ్ ఫేజ్ నోటిఫికేషన్ విడుదల

-

దేశ వ్యాప్తంగా 7 దశల్లో పోలింగ్ జరుగనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే మొదటి దశ నోటిఫికేషన్ విడుదల అయింది. ఏప్రిల్ 19న మొదటిదశ కొన్ని రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగనున్నాయి. తాజాగా రెండవ దశ పోలింగ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. సెకండ్ ఫేజ్ లో దేశంలోని 12 రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. రెండో దశలో దేశవ్యాప్తంగా మొత్తం 88 పార్లమెంట్ స్థానాలకు పోలింగ్ జరగనుంది. గురువారం నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు. ఏప్రిల్ 4 నామినేషన్ల దాఖలకు చివరి తేదీ.

జమ్మూకాశ్మీర్ మినహా మిగిలిన 11 రాష్ట్రాల్లో ఏప్రిల్ 5న నామినేషన్లు పరిశీలించనున్నారు. జమ్మూ కాశ్మీర్లో ఏప్రిల్ 6వ తేదీన నామినేషన్లను పరిశీలించనున్నారు. ఏప్రిల్ 26న రెండో దశ లోక్ సభ ఎన్నికల పోలింగ్ జరగనుంది.  మార్చి 16న కేంద్ర ఎన్నికల కమిషన్ సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ సారి రెండు తెలుగు రాష్ట్రాలైనా ఏపీ, తెలంగాణలో మే 13న నాలుగో దశలో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news