కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గత కొన్ని దశాబ్దాలుగా ఈశాన్య రాష్ట్రాల్లో ఉంటన్న సాయుధ దళాల ప్రత్యేక అధికారాలను(ఏఎఫ్ఎస్పీఏ) కుదిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ చట్టంలోని కల్లోలిత ప్రాంతాలను కుదించనుంది కేంద్రం. గత కొన్నేళ్లుగా నాగాలాండ్, అస్సాం, మణిపూర్ రాష్ట్రాల్లో పలు ప్రాంతాల్లో ఏఎఫ్ఎస్పీఏ చట్టం ఉంది. ప్రస్తుతం ఈ చట్టాన్ని కుదిస్తున్నట్లు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా వెల్లడించారు.
దశాబ్ధాలుగా వివక్షకు గురువుతున్న ఈశాన్య రాష్ట్రాల్లో శాంతి, శ్రేయస్సు, అభివృద్ధి కోసం ప్రధాని నరేంద్ర మోదీ కట్టుబడి ఉన్నారని… ఈశాన్య రాష్ట్రాల్లో సాయుధ దళాల ప్రత్యేక అధికారాలను కదిస్తున్నామని ఆయన అన్నారు. ఈ సందర్భంగా ఈశాన్య రాష్ట్రాలకు ప్రజలకు అభినందనలు తెలియజేస్తూ ట్విట్ చేశారు.
కేంద్ర తీసుకున్న నిర్ణయాన్ని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ స్వాగతించారు. ఏఎఫ్ఎస్పీఏ 1990 నుంచి అమలులోకి వచ్చిందని… ప్రస్తుతం కేంద్రం తీసుకున్న నిర్ణయంతో అస్సాం భవిష్యత్తులో కొత్త అధ్యాయానికి నాంది పలుకుతుందని ఆయన అన్నారు.
Government of India decides to reduce disturbed areas under Armed Forces Special Powers Act (AFSPA) in the states of Nagaland, Assam and Manipur after decades: Union Home Minister Amit Shah pic.twitter.com/2WDCJmp9gI
— ANI (@ANI) March 31, 2022