గుడ్ న్యూస్ : తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు..!

ఒక పక్క కరోనా మహమ్మారి.. మరో పక్క పెరిగిపోతున్న ధరలతో సామాన్యుడికి చుక్కలు కనిపిస్తున్నాయి. అసలే కరోనా కారణంగా ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో కూరుకుపోయి.. సంపాదన లేక ప్రజలు తీవ్ర ఇక్కట్లు పడుతుంటే.. ప్రభుత్వం మాత్రం ఇవేమీ పట్టవన్నట్టు సామాన్యుడి మీద ధరల భారం మోపుతుంది. దీంతో ప్రజలకి కంటి మీద కునుకు లేకుండా పోతుంది. అయితే, ఇప్పటికే ఆకాశాన్ని అంటుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు ఇవాళ కాస్త దిగి రావడంతో సామాన్యుడికి కాస్త ఊరట లభించింది. తాజాగా.. పెట్రోల్ ధర 18 పైసలు, డీజిల్ ధర 24 పైసలు చొప్పున తగ్గించడంతో హైదరాబాద్‌‌లో మంగళవారం లీటరు పెట్రోల్ ధర రూ.84.75కు, డీజిల్ ధర రూ.79.08కు చేరాయి.

అలాగే 17 పైసలు తగ్గుదలతో అమరావతిలో పెట్రోల్ ధర రూ.86.34 చేరగా.. 23 పైసలు తగ్గుదలతో డీజిల్ రూ. 80.27 కి చేరుకుంది. విజయవాడలో కూడా ఇంచుమించు ఇవే ధరలు ఉన్నాయి. ఇక దేశ రాజధాని ఢిల్లీ విషయానికొస్తే.. పెట్రోల్ ధర 17 పైసలు తగ్గుదలతో రూ.81.55కు పడిపోయింది. అలాగే డీజిల్ ధర 22 పైసలు క్షీణతతో రూ.72.56కు పడిపోయింది.