డీప్ ఫేక్ తో జర భద్రం.. వాటిని నమ్మేముందు జాగ్రత్త: మోదీ

-

డీప్ఫేక్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రజలను హెచ్చరించారు. డీప్ఫేక్ వీడియోలు నిజమో కాదో క్షుణ్నంగా పరిశీలించాలని.. అంతే కానీ వైరల్ అవుతున్న ప్రతి వీడియోను ఈజీగా నమ్మేయొద్దని సూచించారు. ‘స్మార్ట్‌ ఇండియా హ్యాకథాన్‌’ ముగింపు కార్యక్రమంలో భాగంగా విద్యార్థులతో మాట్లాడుతూ మోదీ.. ఇటీవలకాలంలో వెలుగుచూస్తున్న డీప్‌ఫేక్ వీడియోలను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారు.

సాంకేతికతల విషయంలో అప్రమత్తంగా ఉండాలని వాటిని జాగ్రత్తగా వాడితే.. అవి మానవాళికి ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని మోదీ తెలిపారు. వాటిని దుర్వినియోగం చేస్తే ప్రమాదకరంగా పరిణమిస్తాయని హెచ్చరించారు. ఏఐతో రూపొందిస్తున్న డీప్‌ఫేక్ వీడియోల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఆ వీడియోలు, ఫొటోలను నిజమని నమ్మేముందు వాటి ప్రామాణికతను సరిచూసుకోవాలని చెప్పారు.

డీప్‌ఫేక్‌ వీడియోలు సమాజానికి పెనుముప్పుగా మారుతున్నాయని మోదీ పేర్కొన్నారు ఇటీవల తాను పాట పాడినట్లుగా ఓ వీడియో వైరల్‌ అయవ్వడంతో తనకు తెలిసినవాళ్లు కొందరు దాన్ని ఫార్వర్డ్‌ చేస్తే చూశానని అన్నారు. ఈ డీప్‌ఫేక్‌ వీడియోలపై ప్రజలకు మీడియా, జర్నలిస్టులు.. తప్పనిసరిగా అవగాహన కల్పించాలని కోరారు.

Read more RELATED
Recommended to you

Latest news