ఎంపీ టికెట్ల కోసం తెలంగాణ కాంగ్రెస్ లో మొదలైన లొల్లి.. అధిష్టానం హామీ ఇచ్చిందంటూ బెర్త్ కన్ఫర్మ్ చేసుకుంటున్న సీనియర్లు..

-

తెలంగాణ రాష్ట్రంలో BRS ని మట్టి కరిపించి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది.. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 12 స్థానాలు ఉంటే 11 స్థానాల్లో కాంగ్రెస్ జెండా రెపరెపలాడింది.. దీంతో పార్లమెంట్ ఎన్నికలపై ఆ పార్టీ గురి పెట్టింది.. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్న నల్లగొండ, భువనగిరి ఎంపీ స్థానాన్ని కైవసం చేసుకునేందుకు పావులు కదుపుతోంది.. ఈ రెండు స్థానాల్లో పోటీ చేసేందుకు సీనియర్లతో పాటు జూనియర్ లు కూడా ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు.. హస్తినలో లాబీయింగ్ లు చేస్తున్నారు.. సీనియర్ నేత జానారెడ్డి మాత్రం తన మనసులో మాట చెప్పేశారు.. పార్టీ పెద్దలాదేశిస్తే నల్లగొండ నుంచి ఎంపి స్థానానికి పోటీ చేస్తానని ప్రకటించారు..

అధిష్టానం పెద్దలు చెప్పారనే అసెంబ్లీ స్థానాన్ని సైతం త్యాగం చేసానని అనుచరులు వద్ద చెబుతున్నారట.. అధిష్టానం పెద్దలు కచ్చితంగా తనకు ఎంపీ సీటు ఇస్తారని ఆయన కాన్ఫిడెంట్ గా ఉన్నారు.. సూర్యాపేట అసెంబ్లీ టికెట్ ఆశించిన పటేల్ రమేష్ రెడ్డికి ఎంపీ టికెట్ ఇస్తామని అప్పట్లో అధిష్టానం హామీ ఇవ్వడంతో ఆయన కూడా ఎంపీ టికెట్ రేస్ లో ఉన్నారు..

మరోపక్క భువనగిరి ఎంపీ సీట్ కోసం సీఎం రేవంత్ రెడ్డి ప్రధాన అనుచరుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి, బీసీ కోటాలో సూర్యాపేట డిసిసి అధ్యక్షులు వెంకన్న యాదవ్ టికెట్ ఆశిస్తున్నారు.. తెలంగాణలో కాంగ్రెస్ హవా ఉండడంతో.. సీట్ల కోసం నేతలు ఫైట్లు చేస్తున్నారు..

Read more RELATED
Recommended to you

Latest news