విద్యార్ధుల మార్కులపై మోడీ కీలక వ్యాఖ్యలు

2022 నాటికి దేశం 75 వ స్వాతంత్య్ర సంబరాలు జరుపుకునేటప్పుడు పాఠశాల విద్యార్థులు కొత్త జాతీయ విద్యా విధానంతో చేర్చే కొత్త పాఠ్యాంశాలను కలిగి ఉండాలని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. మార్క్‌ షీట్ విద్యార్థులకు “ప్రెషర్ షీట్” గా కుటుంబాలకు “ప్రతిష్టాత్మక షీట్” గా మారిందని ప్రధాని చెప్పుకొచ్చారు. ఈ ఒత్తిడిని తొలగించడమే కొత్త విధానం లక్ష్యమని అన్నారు.

ఎన్‌ఈపి సిలబస్‌ను తగ్గిస్తుందని చెప్పారు. ఆహ్లాదకరమైన అనుభవాన్ని కలిగిస్తుందని చెప్పారు. విద్యా మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన “స్కూల్ ఎడ్యుకేషన్ కాన్క్లేవ్” ను ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేసారు. కొత్త పాఠ్యాంశాలు భవిష్యత్తులో శాస్త్రీయంగా ఉంటాయని చెప్పారు. విమర్శనాత్మక ఆలోచన, సృజనాత్మకత, కమ్యూనికేషన్ మరియు ఉత్సుకతను ప్రోత్సహించడానికి ఇది కొత్త నైపుణ్యాలను అందిస్తుందని మోడీ పేర్కొన్నారు. విద్యార్ధులకు ఆందోళన అవసరం లేదని చెప్పారు.