ప్రపంచం విచ్ఛిన్నం అవుతున్నవేళ.. G20 వైపే అందరి చూపు : మోదీ

-

ప్రపంచ దేశాల మధ్య సంబంధాలు తెగిపోతున్న వేళ.. అన్ని దేశాల చూపు జీ20 సదస్సుపైనే ఉందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ప్రపంచ సవాళ్లను ఎదుర్కొనడానికి అన్ని దేశాలు కలిసి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ‘ఒకే భూమి, ఒకే కుటుంబం, ఒకే భవిష్యత్తు’ అనే నినాదంతో.. వసుధైక కుటుంబం అనే భావనతో జీ20 విదేశాంగ మంత్రుల సదస్సు భారత్​లో ప్రారంభమైంది. మార్చి 1 నుంచి 4 వరకు జరుగుతున్న ఈ జీ20 సమావేశానికి హరియాణాలోని గురుగ్రామ్​ వేదికైంది.

ఈ సదస్సులో వీడియో కాన్ఫెరెన్స్​ ద్వారా పాల్గొన్న మోదీ.. విభజించే వాటిపై కాకుండా.. అందరినీ కలిపే అంశాలపై దృష్టి కేంద్రీకరించాలని కోరారు. ఈ విషయంలో గాంధీ, బుద్ధుడు జన్నించిన ఈ భారతదేశ నాగరికత నుంచి ప్రేరణ పొందాలని ప్రతినిధులకు సూచించారు. ప్రపంచ సవాళ్లను ఎదుర్కోవడంపై అన్ని దేశాలు ఏకాభిప్రాయంతో ముందుకు వెళ్లాలని పిలుపునిచ్చారు. ఇటీవల ఎదురైన పలు సమస్యలపై స్పందించిన తీరు.. ప్రపంచ స్థాయి సంస్థల వైఫల్యాన్ని సూచిస్తోందని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news