ఉత్తరాఖండ్‌లో అమృత్‌పాల్‌.. అప్రమత్తమైన పంజాబ్ పోలీసులు

-

ఖలిస్థానీ మద్దతుదారుడు అమృత్‌పాల్‌ సింగ్‌ కోసం పోలీసులు వేట కొనసాగిస్తున్నారు. అమృత్‌పాల్‌ దేశం విడిచిపోయి పారిపోయే అవకాశాలున్నందున పోలీసులు నేపాల్ సరిహద్దుల్లో చెక్‌పోస్టులను అప్రమత్తం చేశారు. మార్చి 20న హరియాణాలో ఉన్న అమృత్‌పాల్‌.. ప్రస్తుతం ఉత్తరాఖండ్‌కు చేరుకున్నట్లు సమాచారం. అక్కడి నుంచి నేపాల్‌ మీదుగా కెనడా వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. భారత్‌ – నేపాల్‌ సరిహద్దుల వద్ద అతడి పోస్టర్లను అంటించారు.

మరోవైపు అమృత్‌పాల్‌ నేరచరిత్రను తవ్వుతున్న అధికారులకు విస్తుపోయే విషయాలు తెలుస్తున్నాయి.  డ్రగ్‌ డీలర్లతో సంబంధాలు, డీ అడిక్షన్‌ కేంద్రాల పేరిట ప్రైవేటు సైన్యాలు, హంతకులతో సంబంధాలు.. ఇలా అతడి చరిత్ర భయానకంగా ఉందని అధికారులు చెబుతున్నారు.

‘శిరోమణి గురుద్వార ప్రబంధక్‌ కమిటీ’ తాను అనుకొన్నట్లు సిక్కు చరిత్రను అన్వయించాలని అమృత్‌పాల్‌ భావించాడు. మత ప్రచారం పేరిట హింసాత్మక భావజాలాన్ని వ్యాప్తి చేయడం మొదలుపెట్టాడు. ‘ఆనంద్‌పూర్‌ ఖల్సా ఫోర్స్‌’ (ఏకేఎఫ్‌) పేరిట ప్రైవేటు సైన్యాన్ని సిద్ధం చేశాడు. మాదకద్రవ్యాల డీఅడిక్షన్‌ పేరుతో తన పూర్వీకుల గ్రామంలో ఓ కేంద్రం ఏర్పాటు చేశాడు. అమృత్‌పాల్‌ గన్‌మన్‌ తేజిందర్‌సింగ్‌ గిల్‌ ఫోను నుంచి ఖన్నా పట్టణ పోలీసులు కీలక వీడియోలను స్వాధీనం చేసుకొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news