మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే వర్గానికి, సీఎం ఏక్ నాథ్ షిండే వర్గానికి బిగ్ షాక్. శివసేన పార్టీ గుర్తు విషయంలో మాజీ ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే వర్గానికి, సీఎం ఏక్ నాథ్ షిండే వర్గానికి కేంద్ర ఎన్నికల కమిషన్ జలక్ ఇచ్చింది. శివసేన గుర్తు ‘విల్లు, బాణం’ ను ఎవరికి కేటాయించేది లేదని శనివారం మధ్యంతర ఆదేశాల్లో స్పష్టం చేసింది.
నాలుగు నెలల కిందట ఏక్ నాథ్ షిండే తిరుగుబాటుతో శివసేన రెండు వర్గాలుగా విడిపోయిన విషయం తెలిసిందే. షిండే తిరుగుబాటుతో మహారాష్ట్రలో ఉద్దవ్ నాయకత్వంలోని మహా వికాస్ ఆగడి ప్రభుత్వం కూలిపోగా, ఆయన బిజెపితో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అయితే, రెండు వర్గాలు తమదే అసలైన బాల్ తాకరే శివసేన అని వాదిస్తున్నాయి. కాగా, ఈసీ తాజా నిర్ణయంతో వచ్చేనెల తూర్పు అందేరి నియోజకవర్గానికి జరగనున్న ఉప ఎన్నికల్లో రెండు వర్గాలు వేర్వేరు పేర్లతో బరిలోకి దిగాల్సి ఉంటుంది.