పోలీసులంతా ఏం చేస్తున్నారు.. అమృత్‌పాల్‌ పరారీపై కోర్టు ఆగ్రహం

-

ఖలిస్థానీ సానుభూతిపరుడు అమృత్‌పాల్‌ సింగ్‌ తప్పించుకుపోయిన వ్యవహారంలో పంజాబ్‌ ప్రభుత్వం పట్ల.. పంజాబ్‌- హరియాణా హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. పోలీసులపైనా ఆగ్రహం వ్యక్తం చేసింది. 80 వేల మంది పోలీసు సిబ్బంది ఉన్నా అమృత్‌పాల్‌ సింగ్‌ ఎలా తప్పించుకున్నాడు? పోలీసులంతా ఏం చేస్తున్నారని ప్రశ్నించింది.

అమృత్‌పాల్‌ సింగ్‌ను పట్టుకునేందుకు రాష్ట్ర పోలీసులు భారీ ఆపరేషన్‌ చేపట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే.. అతడిని పోలీసులు అక్రమంగా నిర్బంధించారని, విడుదలకు ఆదేశించాలని కోరుతూ దాఖలైన హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌పై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.ఎస్‌.షెకావత్‌ విచారణ చేపట్టారు. అయితే, అమృత్‌పాల్‌ పరారీలోనే ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

దీనిపై హైకోర్టు స్పందిస్తూ.. అమృత్‌పాల్‌ సింగ్‌ తప్పించుకోవడం పోలీసుల నిఘా వైఫల్యమేనని పేర్కొంది. ఈ ఆపరేషన్‌కు సంబంధించి ప్రస్తుత పరిస్థితిపై నివేదిక సమర్పించాలంటూ పంజాబ్‌ పోలీసులను ఆదేశించింది. అమృత్‌పాల్‌ పంజాబ్ సరిహద్దులు దాటి ఉంటాడని పోలీసులు అనుమానిస్తోన్న వేళ.. హైకోర్టు ఈ మేరకు వ్యాఖ్యలు చేసింది. మరోవైపు.. అమృత్‌పాల్‌ సింగ్‌పై జాతీయ భద్రతా చట్టాన్ని ప్రయోగించామని పంజాబ్‌ ప్రభుత్వం హైకోర్టుకు తెలిపినట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news