రేపు థియేటర్లకు రానున్న ‘రంగమార్తాండ’ ప్రెస్ మీట్ లో తెలిపిన కృష్ణవంశీ

-

కృష్ణవంశీ గారు భావోద్వేగాలకు సంబంధించిన కథలను తెరపై అద్భుతంగా ఆవిష్కరించడంలో అంత నైపుణ్యత కలవారో అందరికి తెలిసిందే. ఆయన దర్శకత్వం వహించిన ‘రంగమార్తాండ’ రేపు థియేటర్లో రిలీజ్ అవ్వనుంది. ఈ క్రమంలో, ఈ సినిమా ప్రమోషన్స్ పకడ్బందీగానే జరుగుతున్నాయి. కాసేపటి కింద జరిగిన ప్రెస్ మీట్ లో కృష్ణవంశీ మాట్లాడుతూ,  నేను ఈ సినిమా తీయడానికి ముఖ్య కారకుడు. ప్రకాశ్ రాజ్. తను ఈ సినిమా చూసి, నేను రీమేక్ చేస్తే బాగుంటుందని నాకు అప్పగించాడు ఆయన. కథాపరంగా ఈ సినిమాలో ప్రకాశ్ రాజ్ ను చెంపదెబ్బ కొట్టి .. తిట్టగలిగే ఆర్టిస్ట్ ఎవరైతే బాగుంటుందా అని అనుకున్నప్పుడు, అందుకు బ్రహ్మానందమే కరెక్ట్ అనిపించి ఆయనను తీసుకోవాలని అనుకుని నిర్ణయించుకున్న అని తెలిపారు.

Krishna Vamsi say about chiranjeevi gifted car and major accident |  కృష్ణవంశీ కారు ప్రమాదం..! ప్రాణాలు కాపాడిన చిరంజీవి గిఫ్ట్.. అసలేం  జరిగిందంటే..– News18 Telugu

బ్రహ్మానందం గారు ఒప్పుకుంటారా లేదో అనే ఆలోచనతో నేను .. ప్రకాశ్ రాజ్ ఆయన ఇంటికి వెళ్లి .. విషయం ఆయనతో చెప్పాము. ఆయన చాల ఆనందంగ ఒప్పుకున్నారు. 1250 సినిమాలు చేసిన బ్రహ్మానందం గారు .. నేను ఏం చెబితే అది ఒక కొత్త ఆర్టిస్ట్ లా చేశారు. సీన్ కి తగినట్టుగా .. పాత్రకి తగినట్టుగా కనిపించడం కోసం భోజనం మానేసి .. మంచినీళ్లు మాత్రమే తీసుకుంటూ చేశారు అని చెప్పారు కృష్ణవంశీ.

 

 

Read more RELATED
Recommended to you

Latest news