పెళ్లి గురించి రాహుల్ గాంధీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. వీడియో వైరల్

-

దేశంలోని మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఒకరు. అయితే తాజాగా రాహుల్ గాంధీ తన పెళ్లి పై స్పందించారు. తన మనసులోని మాటని బయటపెట్టారు. తన జీవిత భాగస్వామి ఎలా ఉండాలని కోరుకుంటున్నారో బయటపెట్టారు. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడోయాత్ర రాజస్థాన్ లో జరుగుతున్న సమయంలో ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఆ ఇంటర్వ్యూ ని తన సోషల్ మీడియాలో రిలీజ్ చేసింది కాంగ్రెస్ పార్టీ. ఈ వీడియోలో పలు ఆసక్తికర అంశాలను పంచుకున్నారు రాహుల్ గాంధీ. తన వివాహం పై యాంకర్ అడిగిన ప్రశ్నలకు సరదాగా సమాధానాలు చెప్పారు. సరైన అమ్మాయిలు దొరికితే పెళ్లి చేసుకుంటానని 52 ఏళ్ల రాహుల్ గాంధీ వెల్లడించారు. మీరు ఇప్పట్లో పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నారా..? అని యాంకర్ అడగగా..

” సరైన అమ్మాయి దొరికితే కచ్చితంగా చేసుకుంటాను” అన్నారు రాహుల్ గాంధీ. అమ్మాయి ఇంటలిజెంట్ అయితే చాలని చెప్పుకొచ్చారు. దీనికి యాంకర్ మీ మెసేజ్ అమ్మాయిలకు చేరుతుంది లేండి అని అనడంతో.. మీరు నన్ను ఇబ్బందుల్లో పడేస్తున్నారు అంటూ నవ్వేశారు రాహుల్ గాంధీ. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news