రాజస్థాన్ అసెంబ్లీలో హైడ్రామా నెలకొంది. ఆ రాష్ట్ర సీఎం అశోక్ గహ్లాట్ చేసిన ఓ తప్పు వల్ల అసెంబ్లీ అరగంట పాటు వాయిదా పడింది. 2023-24 బడ్జెట్‌కు బదులుగా గతేడాది బడ్జెట్‌లోని సారాంశాలను సీఎం చదివారని ప్రతిపక్షాలు ఆరోపించాయి. వెంటనే ప్రతిపక్షాలు ఒక్కసారిగా వెల్లోనికి ప్రవేశించి రచ్చ చేశాయి.
ఆ సమయంలో స్పీకర్ సీపీ జోషి కలగచేసుకుని.. విపక్షాలు ఆందోళన వీడాలన్నారు. కానీ ప్రతిపక్ష సభ్యులు నినాదాలను ఆపలేదు. దీంతో స్పీకర్ సభను అరగంట వాయిదా వేశారు. సభను వాయిదా వేయడంతో బీజేపీ ఎమ్మెల్యేలు వెల్‌లోనే నిరసన కొనసాగించారు. బడ్జెట్‌ను ప్రవేశపెట్టరాదు అని, అది లీకైందా అని బీజేపీ నేత గులాబ్ చాంద్ కటారియా తెలిపారు.