FLASH : 2019-20లో ఒక్క రెండు వేల నోటు కూడా ముద్రించలేదు..!

-

గత ఆర్థిక సంవత్సరం 2019-20లో ఒక్క 2,000 రూపాయల నోటు కూడా ముద్రించలేదని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) మంగళవారం వెల్లడించింది. 2018 నుంచి ఈ నోట్ల చలామణి క్రమంగా తగ్గిందని ఆర్‌బీఐ తన వార్షిక నివేదికలో పేర్కొంది. 2 వేల విలువైన కరెన్సీ నోట్ల సంఖ్య 2018 మార్చి చివరి నాటికి 33,632 లక్షలు ఉండగా, 2020 మార్చి ఆఖరికి 27,398 లక్షల నోట్లకు పడిపోయిందని ఆర్‌బీఐ నివేదిక తెలిపింది.

అలాగే రూ. 500, రూ. 200 విలువైన కరెన్సీ నోట్ల ముద్రణను ఆర్‌బీఐ గణనీయంగా పెంచడంతో మార్కెట్లో వీటి సర్క్యులేషన్‌ పెరిగింది. 2018 నుంచి మూడేళ్లలో వీటి విలువ, నోట్ల సంఖ్య పెరిగింది. ఈ నేపథ్యంలో కేంద్రం రూ.2 వేల నోట్లను రద్దు చేయొచ్చని వార్తలు కూడా వస్తున్నాయి. 2016లో నోట్ల రద్దు ప్రకటన వెలువడినప్పటి నుంచి కరెన్సీపై ప్రభుత్వం, లేదా ఆర్‌బీఐ నుంచి ఏ చిన్న వార్త వచ్చినా, మళ్లీ నోట్ల రద్దు అంటూ వదంతులు వ్యాపిస్తున్నాయి. సోషల్‌ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news