మోసగాళ్లతో జాగ్రత్త అని హెచ్చరించిన ఆర్బీఐ

-

ఆర్బీఐ ( RBI ) బ్యాంకు మనదేశంలో బ్యాంకులకు పెద్దన్న అన్న విషయం అందరికీ తెలిసిందే. అసలు ఆర్బీఐ ఎలా చెప్తే అలానే బ్యాంకులన్నీ నడుచుకుంటూ ఉంటాయి. ప్రభుత్వ రంగ బ్యాంకులంటే ఏమో అనుకోవచ్చు… కానీ మన దేశంలో ప్రైవేటు సెక్టార్​ లో ఉన్న పెద్ద బ్యాంకులు కూడా ఆర్బీఐ ఎలా చెబితే అలా చేయాల్సిందే. ఆర్బీఐ విధానాలకు నిర్ణయాలకు ఎదురు చెప్పే సాహసం ఎవరూ చేయరు. కానీ ప్రస్తుత రోజుల్లో మాత్రం పరిస్థితులు మారుతున్నాయి. బ్యాంకులకు పెద్దన్నలా వ్యవహరిస్తూ.. దేశ ఆర్థిక స్థితులను కంట్రోల్​ చేసే ఆర్బీఐ పేరునే కొందరు కేటుగాళ్లు డ్యామేజ్​ చేస్తున్నారు.

 

RBI | ఆర్బీఐ
RBI | ఆర్బీఐ

ఆర్బీఐ పేరు చెప్పుకుని అమాయకులను బురిడీ కొట్టిస్తున్నారు. ఈ విషయం గ్రహించిన ఆర్బీఐ అందర్నీ హెచ్చరిస్తూ ట్వీట్​ చేసింది. ఇంతకీ ఏం జరిగిందంటే… పాత నోట్లు, పాత నాణేలు తీసుకుని అధికంగా డబ్బులు చెల్లిస్తామని కొంత మంది కేటుగాళ్లు వెబ్​ సైట్లు ఓపెన్​ చేసి మరీ అమాయకులను మోసం చేస్తున్నారు. అంతే కాకుండా తమకు ఆర్బీఐ అనుమతి ఉందని చెబుతూ చలామణీ అవుతున్నారు.

ఈ విషయం గురించి తెలుసుకున్న ఆర్బీఐ పెద్దలు స్పందిస్తూ… ఒక ట్వీట్​ చేశారు. తాము ఎవరికీ పాత నోట్లు, పాత నాణేలు కలెక్ట్ చేయమని చెప్పలేదని తమ పేరును వాడుకుంటూ కొంత మంది కేటుగాళ్లు అనవసరంగా ప్రజలను మోసం చేస్తున్నారని వివరించారు. అటువంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని వినియోగదారులకు సూచించారు. తాము ఎవరకీ కూడా కమిషన్లు వసూలు చేసే బాధ్యతలను అప్పగించలేదని స్పష్టం చేశారు.  బ్యాంకులనే కంట్రోల్​ చేసే ఆర్బీఐ పేరు వాడుకుని కేటుగాళ్లు చేసే పనులు తెలిసిన కొంత మంది హవ్వా అని ఆశ్చర్యపోతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news