బ్రేకింగ్ : రాజ్య‌స‌భ ఉప ఎన్నిక‌కు నోటిఫికేష‌న్ విడుద‌ల‌

-

రాజ్యసభ స్థానాల ఉప ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. ఖాళీ అయిన రాజ్యసభ స్థానాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. ఎపి, తెలంగాణ సహా 15 రాష్ట్రాల్లో 57 రాజ్యసభ స్థానాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది కేంద్ర ఎన్నికల సంఘం.

ఎన్నిక జూన్ 10, ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగానున్నట్లు పేర్కొంది కేంద్ర ఎన్నికల సంఘం. అదే రోజు కౌంటింగ్ నిర్వహించనున్నారు. ఎపి నుంచి 4 తెలంగాణా నుంచి 2 స్థానాలకు నోటిఫికేషన్ విడుదల అయింది. 24 మే నోటిఫికేషన్ పరిశీలన ఉండనుండగా జూన్ 1 ఉపసంహరణ ఉండనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం పేర్కొంది.

కాగా భారత ఎన్నికల ప్రధాన అధికారి గా రాజీవ్ కుమార్ నియామకం అయ్యారు. ఈ మేరకు కేంద్ర న్యాయ శాఖ మంత్రిత్వ శాఖ గురువారం నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రస్తుతం భారత ఎన్నికల ప్రధాన అధికారి సుశీల్ చంద్ర పదవి కాలం మే 14 తో ముగియనుంది. దీంతో ఆయన స్థానంలో రాజీవ్ కుమార్ మే 15వ తేదీన బాధ్యతలు స్వీకరించనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news