దేశంలో ఈ మధ్య కాలం లో కరోనా కేసులు గణనీయం గా పెరుగుతున్నాయి. ముఖ్యం గా ఒక ఐదు రాష్ట్రాల లో కేసులు పెరుగుతున్నాయి. దీంతో ఆయా రాష్ట్రాలను కేంద్రం అలర్ట్ చేసింది. ప్రత్యేకం గా ఆ ఐదు రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం లేఖలు కూడా రాసింది. దేశంలో వస్తున్న కేసు లలో ఎక్కువ భాగం జమ్మూ కాశ్మీర్, తమిళనాడు, మిజోరాం, కేరళ, ఒడిశా, కర్ణాటక రాష్ట్రా లలో నుంచే వస్తున్నాయి. అయితే ఈ రాష్ట్రాలకు కేంద్రం లేఖ రాసింది.
కరోనా వైరస్ వ్యాప్తి పై ఫోకస్ చేయాలని సూచించింది. అంతే కాకుండా ఆ యా రాష్ట్రా లలో హాట్ స్పాట్ లను ఎప్పటి కప్పుడు గుర్తించాలని సూచించింది. ఆ హాట్ స్పాట్ లను క్రమం తప్పకుండా పర్యవేక్షించాలని కూడా సూచించింది. అలాగే ఇతర దేశాల నుంచి వచ్చే ప్రయాణికుల పై ఫోకస్ చేయాలని ఆదేశించింది. అలాగే ఓమిక్రాన్ వేరియంట్ ఉన్న దేశాల నుంచి వచ్చిన ప్రయాణికులను గుర్తించాలని సూచించింది. ఆ దేశాల నుంచి వచ్చిన వారి శాంపిల్స్ ను వెంటనే జీనోమ్ సీక్విన్సింగ్ పంపాలని ఆదేశించింది. అలాగే కరోనా వ్యాప్తి ని అడ్డు కోవడానికి ప్రణాళిక లను సిద్ధం చేయాలని సూచించింది.