World Cup 2023 : రోహిత్ శర్మకు బెస్ట్ ఫీల్డర్ మెడల్..వీడియో వైరల్‌

-

World Cup 2023 :  సౌత్ ఆఫ్రికాతో మ్యాచ్ అనంతరం టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మను టీం మేనేజ్మెంట్ బెస్ట్ ఫీల్డర్ మెడల్ తో సత్కరించింది. WCలో IND ఆడే ప్రతి మ్యాచ్ తర్వాత ఫీల్డింగ్ కోచ్ టీ.దిలీప్ ఫీల్డింగ్ లో అదరగొట్టిన ప్లేయర్లకు మెడల్ ఇస్తున్నారు.

Rohit Sharma get mobbed by teammates after winning best fielder medal

ఈ సారి ఈ మెడల్ రోహిత్ శర్మను వరించింది. శ్రేయస్ అయ్యర్ హిట్ మ్యాన్ కు మెడల్ అందజేయగా… మిగతా ప్లేయర్లు కేరింతలు, చప్పట్లతో ఆనందం వ్యక్తం చేశారు. కాగా ,  విరాట్ కోహ్లీని క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ ప్రత్యేకంగా సత్కరించింది. ‘హ్యాపీ బర్త్డే విరాట్’ అని రాసిన బంగారు పూత బ్యాట్ ను CAB ప్రెసిడెంట్ స్నేహశిశ్ గంగూలి కోహ్లీకి బహుకరించారు. అలాగే ‘వయస్సు కేవలం ఒక సంఖ్య. దీనికి సజీవ సాక్ష్యం మీరే’ అన్న అక్షరాలను కూడా బ్యాట్ పై ముద్రించారు.

Read more RELATED
Recommended to you

Latest news