భారత్ కు రష్యా నుంచి ఎస్ -400 మిస్సైల్ సిస్టమ్స్….

-

భారత క్షిపణి రక్షణ వ్యవస్థ మరింత బలోపేతం కానుంది. రష్యా నుంచి భారత్ కు ఎస్ -400 మిస్సైల్ డిఫెన్స్ సిస్టమ్ త్వరలో రానున్నాయి. దీంతో భారత్ క్షిపణి దుర్భేధ్యంగా మారనుంది. ఉక్రెయిన్ యుద్ధం కారణంగా సరఫరా ఆలస్యం అవుతుందని భావించినప్పటికీ.. ఒప్పందం ప్రకారం రష్యా, భారత్ కు సకాలంలో వీటిని సరఫరా చేస్తోంది. కీలక విడిభాగాలు, సెకండ్ రెజిమెంట్ భాగాలు, సిమ్యులేటర్లు భారత్ కు రావడం ప్రారంభం అయిందని అధికారులు వెల్లడించారు. మొత్తం ఈ ఒప్పందం విలువ 5 బిలియన్ డాలర్లు. 

అయితే ఎస్ -400 సిస్టమ్ దిగుమతిపై అమెరికా గుర్రుగా ఉంది. గతంలో ఈ ఒప్పందం చేసుకుంటే అమెరికా కాట్సా చట్టాన్ని ప్రయోగిస్తామని హెచ్చరించింది కూడా. అయితే భారత్ ఎలాంటి ఒత్తడికి తలొగ్గకుండా… భారత రక్షణే ప్రథమంగా ఎస్ -400 డీల్ ఓకే చేసింది. ఇటీవల రష్యా విదేశాంగ మంత్రి లావ్రోవ్ వచ్చిన సందర్భంలో కూడా ఎస్ -400 క్షిపణులను త్వరలో భారత్ కు అందించాలని కోరింది. ఈనేపథ్యంలో ఇండియాకు ఈ క్షిపణి వ్యవస్థ రానుంది. ఇప్పటికే టర్కీ, చైనాలకు రష్యా ఎస్ -400 సరఫరా చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news