సీఎం కేసీఆర్ మరోసారి ఢిల్లీ వెళ్లనున్నారు. అంతేకాదు.. కేంద్రం లోని బీజేపీ పై పోరు సాగిస్తున్న తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. లిఖింపూర్ ఖేరీ సంఘటన లో మృతి చెందిన రైతుల కుటుంబాలను ఆయన పరామర్శించనున్నారు.
ఇందులో భాగంగానే త్వరలోనే సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటన చేపట్టనున్నారు. 10 రోజుల పాటు సాగే ఈ పర్యటన లో యూపీఓని లఖింపూర్ ఖేరికి కూడా వెళ్లనున్నట్లు తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వ తీసుకొచ్చిన సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతుల పైకి కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు కారును ఎక్కించారు.
ఈ ప్రమాదంలో రైతులు, ఓ జర్నలిస్టు మరణించారు. మరికొందరు గాయాలపాలయ్యారు. అయితే.. యూపీ ఎన్నికల్లోలఖింపూర్ ఖేరి నుంచి బీజేపీ పార్టీ అభ్యర్థి విజయం సాధించారు. ఈ నేపథ్యంలోనే సీఎం కేసీఆర్ అక్కడకు వెళ్లడం ప్రాధాన్యతను సంతరించుకుంది. కేసీఆర్ ఢిల్లీపర్యటనపై ఇవాళ సాయంత్రం లోపు స్పష్టం రానుంది.