రష్యా- ఉక్రెయిన్ వార్ ఎఫెక్ట్: పెరిగిన స్టీల్ ధరలు

-

రష్యా- ఉక్రెయిన్ మధ్య యుద్ధం భీకరంగా జరుగుతోంది. ఈ రెండు దేశాల మధ్య యుద్ధం మిగతా ప్రపంచంపై కూడా పడుతోంది. ముఖ్యంగా యూరోపియన్ దేశాలు, అమెరికా, కెనడా, జపాన్, ఆస్ట్రేలియా వంటి దేశాలు రష్యాపై ఆంక్షలను పెట్టాయి. దీంతో రష్యా నుంచి ఎగుమతి అయ్యే వస్తువులపై ఈ ప్రభావం పడుతోంది. దీంతో రేట్లు పెరిగే అవకాశం ఏర్పడుతోంది. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా క్రూడ్ ఆయిల్ ధరలు ఆల్ టైం హైయెస్ట్ కు చేరుతున్నాయి. మరోవైపు వంట నూనెల ధరలు కూడా విపరీతంగా పెరిగాయి. ఈ ప్రభావం ఇండియాపై కూడా కనిపిస్తోంది.

 

ఇదిలా ఉంటే వార్ ఎఫెక్ట్ స్టీల్ పై కూడా కనిపిస్తోంది. స్టీల్ ధరలు పెరుగుతున్నాయి. యుద్ధప్రభావంతో ముడిపదార్ధాల వ్యవస్థపై ప్రభావం పడటంతో దేశీయంగా హెచ్ఆర్సీ, టీఎంటీ బార్స్ స్టీల్ ధరలను టన్నుకు రూ.5 వేల వరకు పెంచారు. దీంతో హెచ్ఆర్సీ ధర టన్నుకు రూ. 66 వేలకు , టీఎంటీ ధర 65 వేలకు చేరింది. కోకింగ్ కోల్ టన్ను ధర 500 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. కొన్ని వారాలతో పోలిస్తే ధరలు 20 శాతం మేర పెరిగినట్లు పరిశ్రమ వర్గాలు అంటున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news