మధ్యప్రదేశ్ లో బీజేపీకి షాక్.. రాజీనామా చేసిన రాజ్యసభ ఎంపీ

-

లోక్ సభ  ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. ఇలాంటి టైంలో పార్టీ ఫిరాయింపులు ఎక్కువయ్యాయి. మధ్యప్రదేశ్ లో అధికార బీజేపీకి షాక్ తగిలింది. బీజేపీ రాజ్యసభ ఎంపీ అజయ్ ప్రతాప్ సింగ్ బీజేపీకి రాజీనామా చేశారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసినట్లు ట్విట్టర్ లో పోస్టు చేశారు.

బీజేపీ చీఫ్ నడ్డాకు, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు వి.డి. శర్మకు రాజీనామా లేఖలు పంపించారు అజయ్ ప్రతాప్సింగ్. మార్చి 2018లో అజయ్ ప్రతాప్ సింగ్ ను రాజ్యసభకు నామినేట్ చేసింది బీజేపీ మరోవైపు అజయ్ ప్రతాప్ సింగ్ రాజీనామాకు కారణం లోక్ సభ టికెట్ దక్కక పోవడమే అని తెలుస్తోంది. లోక్ సభ ఎన్నికల అభ్యర్థుల ఎంపికలో బీజేపీ భారీ అవినీతికి పాల్పడిందని ఆరోపించారు అజయ్ ప్రతాప్ సింగ్.

బీజేపీలో అవినీతిపరులకు రక్షణ లభిస్తోందని, రాజకీయ వ్యాపారులకు ఆ పార్టీ అడ్డాగా మారిందని ఆరోపించారు. మరోవైపు సిద్ది నియోజకవర్గం నుంచి బీజేపీ ఎంపీ టికెట్ ఆశించిన వారిలో అజయ్ ప్రతాప్ సింగ్ ఒకరు. ప్రజల సర్వే ఆధారంగా బీజేపీ టికెట్లు కేటాయిస్తుందని గతంలో చెప్పినప్పటికీ.. ప్రస్తుతం అవేమి పాటించడం లేదని ఆరోపించారు అజయ్ ప్రతాప్ సింగ్.

Read more RELATED
Recommended to you

Latest news