అణగారిన వర్గాలకు సీఎం జగన్ పెద్దపీఠ.. సామాజిక న్యాయం అంటే ఇదేనేమో..

-

ప్రతిపక్షాలకు దిమ్మ తిరిగేలా.. ఏపీ చరిత్రలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ప్రాధాన్యత కల్పిస్తూ సీఎం జగన్ అభ్యర్థులను ఎంపిక చేసి.. తన టీం ను విడుదల చేశారు.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున సామాన్యులకు మహిళలకు విద్యావంతులకు టిక్కెట్లను ఖరారు చేసి.. సోషల్ ఇంజనీరింగ్ కి తానే బ్రాండ్ అంబాసిడర్ అన్నట్లుగా ఇడుపులపాయ వేదికగా టిక్కెట్లను ప్రకటించారు.. దీనిపై రాజకీయ విశ్లేషకులు సైతం ఆశ్చర్య పడుతున్నారు..

ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన జాబితాలో సోషల్ ఇంజనీరింగ్ సీఎం జగన్ పెద్దపీఠ వేశారు.. బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు 50 శాతం సీట్లు కేటాయించారు. మొత్తం 175 స్థానాలలో 84 మందికి ఎమ్మెల్యే స్థానాలు 16 మందికి ఎంపీ స్థానాలు కల్పిస్తూ అందర్నీ ఆశ్చర్యాలకు గురి చేశారు.. అణగారిన వర్గాల ఓట్ల కోసం చంద్రబాబు నాయుడు నక్కజిత్తులమారి ఎత్తులు వేస్తే.. వారికే రాజ్యాధికారం ప్రకటించాలంటూ సీఎం జగన్ సోషల్ ఇంజనీరింగ్ ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు..

ఏపీలో ఉండే 25 ఎంపీ సీట్ల గాను నాలుగు ఎస్సీలకి, ఒకటి ఎస్టీకి, 11 బీసీలకి, 9 ఓసి లకు సీఎం జగన్ కేటాయించారు.. గత ఎన్నికల్లో కంటే అదనంగా 11 సీట్లను ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు కేటాయించి.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆయా సామాజిక వర్గాలకు పెద్దపీట వేసింది అనే సంకేతాలను జనాల్లోకి పంపారని రాజకీయ పండితులు చెబుతున్నారు.. 2019 ఎన్నికల్లో మైనార్టీలకు 5 ఎమ్మెల్యే స్థానాలు కేటాయించగా.. ఈసారి ఏడు స్థానాలను కేటాయించారు.. దానితోపాటు నిత్యం ప్రజల్లో ఉండడం.. విద్యావంతులుగా పేరు ఉన్న నేతలకే ఎమ్మెల్యే ఎంపీ స్థానాలు కేటాయించారు సీఎం జగన్ మోహన్ రెడ్డి.. ఆయన చేసిన సాహసానికి ప్రతిపక్షాలు సైతం ఇలాంటి నాయకుడు కిందే పని చేయాలని చర్చించుకుంటున్న పరిస్థితి ఏపీలో కని

పిస్తోంది..

Read more RELATED
Recommended to you

Latest news